E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ వర్కౌట్.. బాలు మరదలు ఎంట్రీ.. ప్రభావతికి ఏమైంది..?

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ వర్కౌట్.. బాలు మరదలు ఎంట్రీ.. ప్రభావతికి ఏమైంది..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 17th : రాజేష్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ 2000 ఫైన్ఇస్తాడు అని బాలుకు చెప్పడంతో.. వాడు కావాలనే మన మీద పగబెట్టాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలి అని బాలు అంటాడు. అటు సుమతి ఆస్పత్రికి అరుణ్ తన తల్లిని తీసుకొని వస్తాడు. అయితే సుమతి ఆమెని చాలా బాగా చూసుకోవడంతో అరుణ్ సుమతీల మధ్య లవ్ ట్రాక్ మొదలు ఎలా కనిపిస్తుంది. అరుణ్ వాళ్ళ అమ్మకి సుమతి బాగా నచ్చింది.. నా కుటుంబం గురించి ఎన్నో డీటెయిల్స్ అడిగినా అరుణ్ వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇల్లు మాత్రం బృందావనం అవుతుంది అని అంటుంది.. తర్వాత అరుణ్ సుమతిని ప్రేమగా చూస్తాడు..

అయ్యో.. బాలును కొట్టిన ప్రభా..

బాలు ఎటువంటి ట్రిప్పులు లేవు అని ఇంట్లో కూర్చుని ఉండగా.. మీనా మీకు ఇప్పుడు ట్రిపుల్ ఏమీ లేవా.. అయితే ఈ కూరగాయలు కట్ చేయండి నేను వంట చేస్తాను అని బాలుకి పెద్ద పని అప్పగిస్తుంది.. కూరగాయలే కదా కట్ చేస్తాను అని బాలు అంటాడు.. ప్రభావతి బాలుని ఇలా చూస్తే కచ్చితంగా అరుస్తుంది పెళ్ళాం వలలో చిక్కుకున్నాడు అని తిడుతుంది అని మీనా అనుకుంటూ ఉంటుంది. సత్యంతో అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా బాలు కత్తి తీసుకొని లోపలికి వస్తాడు. అది చూసిన ప్రభావతి  ఏంట్రా కత్తితో చంపేస్తావా ఏంటి నువ్వు మీ ఆవిడకి ఏవైనా చెప్పు నాకు ఏ సంబంధం లేదు అని అంటుంది. మాట వినగానే ప్రభావతి బాలుని వంగొ పెట్టి గుద్దేస్తుంది దాంతో బాలు గుండెకాయలు గులాబ్ జామ్ లాగా రాలిపోయాయి అని అంటాడు. ఈ విధంగా మనోజ్ ని కొట్టి ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు కదా.. అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది.

సుందరి ఎంట్రీ..

Advertisement

సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా రంగ అక్కడికి వస్తాడు. ఏమైంది సడన్గా ఇలా వచ్చావ్ ఏంటి అని అందరూ అడుగుతారు. కానీ నిన్ను చూసి చాలా రోజులైంది మామ అని బాలు కూడా అడుగుతాడు అయితే మీ నాకు కాఫీ తెచ్చి రంగా తీస్తుంది.. మా తమ్ముడు కూతురు సుందరి హాస్టల్లో ఉంటుంది కదా ఆమెను తీసుకురావాలి నాకు యూనియన్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. బాలుని పంపిద్దామని ఇక్కడికి వచ్చాను అని రంగా అనగానే సుందరి వస్తుందా? చిన్నప్పుడు నన్ను బావ బావ అంటూ ఎంత ముద్దుగా పిలిచేదో తనని చూడాలని నాకు కూడా ఎంత ఆత్రుతగా ఉంది అని అంటాడు. దానికి మీనా ఉడుకుంటుంది. నేను దగ్గరుండి సుందరిని తీసుకొని వస్తాను అని బాలు అంటాడు.

ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి..

ప్రభావతికి చింతామణి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మీనా ఏం చేస్తుంది అని అడుగుతుంది. డెకరేషన్ పని కోసం వెళ్లడానికి అందరికీ ఫోను చేసి అన్ని సిద్ధం చేస్తుంది అని ప్రభావతి అంటుంది. అయితే మీ కోడలు అక్కడి గనుక వస్తే మీరు ఇంకా జీవితాంతం తన కింద పని చేయాలి అని ప్రభావతిని ఇంకాస్త రెచ్చగొడుతుంది చింతామణి.. తనని ఈరోజు డెకరేషన్ పనికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని చింతామణితో ప్రభావతి అంటుంది. ఎలాగైనా సరే మీనాని మీ పెద్ద ఆర్డర్ చేయనివ్వకుండా చేయాలి అని ప్రభావతి కంకణం కట్టుకొని కిందకొచ్చి హడావిడి చేస్తుంది.. ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ప్రభావతిని చూసి అందరూ అనుకుంటారు.

మనోజ్, రోహిణికి అనుమానం..

Advertisement

మనోజ్ కింద తింటూ ఉండగా ప్రభావతి ఏంటి ఎన్ని దోశలు తింటావు? తింటే అక్కడ బెడ్లు ఉన్నాయని పడుకొని ఉంటావా ఏంటి అని తిడుతుంది. అంతే కాదు రోహిణిని జ్యూస్ ఎంత సేపు తాగుతావు అంతసేపు తాగితే అందులోని మినరల్స్ విటమిన్స్ బయటకు పోతాయి అని అంటుంది. ప్రభావతి మీనా నువ్వు ఎలాగైనా సరే ఇంట్లోనే ఉంచేలా చేయాలి వీళ్ళందర్నీ ఏదో ఒకటి చేసి బయటికి పంపించాలి అని అనుకుంటుంది. అయితే హడావిడి చేస్తున్న ప్రభావతిని చూసి మనోజ్ రోహిణి లకు ఏదో జరిగింది అని అనుమానం వస్తుంది. అంతే కాదు సత్యం బయటకు వెళ్తూ ఉండగా మీరు తొందరగా వెళ్ళండి ఆటో వాడు లేట్ చేస్తే డబ్బులు చార్జ్ చేస్తాడు.. అని చాలా అని హడావిడిగా అందర్నీ బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది కానీ అందరికీ ప్రభావతి చూస్తే అనుమానం మొదలవుతుంది. శృతి, రవి లు కూడా వెళ్లాలి అని కిందకు రాగానే ఇంతవరకు వెళ్లలేదా వెళ్ళండి తొందరగా అని తొందర పెడుతుంది ప్రభావతి..

మీనాను లాక్ చేసిన ప్రభావతి…

అయితే అందరూ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ప్రభావతి తన ప్లాన్ ని పక్కాగా చేయాలి అని అనుకుంటుంది. సడన్గా తనకి చెయ్యి నొప్పి వచ్చేసింది అని బాధపడిపోయినట్లు నటిస్తుంది.. అప్పుడప్పుడు నా చెయ్యి ఇలానే వాపు లాగా వచ్చేసి ఇబ్బంది పెడుతుంది నేను ఏ పని చేసుకోలేను ఇవాళ నువ్వు దగ్గర ఉండి నాకు అన్ని పనులు చేయాలి అని మీనా అని అంటుంది. కానీ మీనా డెకరేషన్ పనులు చేయడానికి టైం అయిపోతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. బాలు ఫోన్ చేసి నేను ఎక్కడున్నావని అడుగుతాడు. అయితే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా ఇక్కడ డెకరేషన్ పనులు ఎవరు చేస్తారు అని బాలు అడుగుతాడు. మీ అమ్మకి సడన్గా చెయ్యి నొప్పి వచ్చింది వాపు వచ్చిందట. ఆవిడ ఇబ్బంది పడిపోతుంది అని బాలుకి చెప్పడంతో మా అమ్మకి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ లేదే ఇదేంటి కొత్తగా అని అంటాడు. ఇక డెకరేషన్ నీ వీడియో కాల్ చేసి చూడమని చెప్తాడు బాలు. మొత్తానికి దగ్గరుండి బాలు డెకరేషన్ పనులు చూసుకుంటూ ఉంటాడు.. ఇక ప్రభావతి మాత్రం మీనని ఆడుకుంటూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి క్లాస్ పీకిన భానుమతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×