Intinti Ramayanam Today Episode October 30 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆ తింగరోడి కోసం నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చక్రధర్ పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. మీ ఆస్తికి వారసురాలు నేనే కదా ఆస్తిని వాటపంచండి అని అడుగుతుంది.. ఏ తండ్రి తన బిడ్డలకి వాటపరచాలని కచ్చితంగా రూల్ లేదు. నేను వాడికైతే అస్సలు రూపాయి కూడా ఇవ్వను. నీకు కావాలంటే చెప్పు ఎంతైనా ఇస్తాను. వాన్ని వదిలేసి వచ్చేసేయ్ నువ్వు ఇక్కడే ఉంటే నా బిజినెస్లకు నువ్వే మహారాణి అవుతావు అని చక్రధరంటాడు.. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డబ్బులు తీసుకొని వస్తానని వెళ్ళావు కదా..
నా చేత ఏం బిజినెస్ పెట్టిస్తున్నావు అని కమల్ అడుగుతాడు. డబ్బులు ఏం ఎంత తెచ్చావో చెప్తే ఏం పెట్టాలో నేను చెప్తాను అని కమలం అంటాడు. నేను డబ్బులు తీసుకురాలేదు బావ అని పల్లవి అంటుంది. మీ నాన్న ఎలాగో డబ్బులు ఇవ్వడు కానీ నువ్వు ఇంట్లో పని వంట పని అవన్నీ చూసుకో తర్వాత ఎక్స్ట్రాలు మాట్లాడొచ్చు అని అంటాడు. శ్రియ శ్రీకర్ తాగి రావడంతో అవని అక్షయ్ ఇద్దరు క్లాస్ పీకుతారు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి కమల్ చెప్పిన పనులన్నీ చేయాలని అనుకుంటుంది. బయట కూరగాయలు మూసుకొని వస్తుంటే ఎదురుగా తన ఫ్రెండు రావడం చూసి ఇది గనక నన్ను చూస్తే కచ్చితంగా అందరికీ చెప్పేస్తుంది. నా పరువు పోతుంది అని మేనేజ్ చేస్తుంది.. ఒక కారు పక్కన నిలబడుకున్న పల్లవిని చూసిన ఫ్రెండ్ కారు చాలా బాగుంది మీదేనా అని అడుగుతుంది. నేను ఏ కార్నైనా ఒక సంవత్సరం నుంచి వాడను కదా అందుకే కొత్త కారు కొన్నాను అని పల్లవి అంటుంది. సరేగాని మీ హస్బెండ్ ఏం చేస్తారు అని తన ఫ్రెండ్ అడగగానే మా హస్బెండ్ యూఎస్ కంపెనీకి సీఈఓ అని గొప్పగా చెప్తుంది.
పల్లవి ఇవన్నీ చెప్తుండగానే ఓ వ్యక్తి వచ్చి మీ సొంత కార్ లాగా అనుకున్నవేంటి పక్కకు జరుగు అని అంటాడు. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది. అతను కార్ తీసుకొని వెళ్ళిపోవడంతో తన ఫ్రెండు నీకారు అన్నావ్ కొత్త కారు అన్నావ్ ఎన్నెన్నో మాట్లాడావ్ ఏంటి ఇదంతా అని అడుగుతుంది. అప్పుడు అక్కడికి కమల్ వస్తాడు. నువ్వు మా ఇంట్లో ఎలక్ట్రిషన్ పని చేశావు కదా చాలా బాగా చేశావు బెడ్రూంలో కూడా ఫ్యాన్లు మంచిగా తిరుగుతున్నాయి. రేపు ఒకసారి ఇంటికి రా ఇంకొంచెం పని ఉంది అని అంటుంది.
ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని కమల్ పల్లవిని అడుగుతాడు. పల్లవి తన ఫ్రెండుకి తన హస్బెండ్ గొప్పవాడని గొప్పలు చెప్పుకొని ఉంటుంది. కమల్ ఏయ్ అనడంతో నువ్వేంటి నా ఫ్రెండుని ఏ అంటున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు నీ ఫ్రెండ్ బాగా గొప్పది కానీ ఇప్పుడు మాత్రం కాదు నా భార్య నా భార్యని ఏ అంటే తప్పేంటి అని కమలంటాడు. పల్లవిం తీసుకుని ఇంకా ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి రాగానే పల్లవి కూరగాయలను విసిరి కొట్టేస్తుంది. ఏంటి కూరగాయలు అలా విసిరి కొడుతున్నావు పిచ్చి ఏమైనా పట్టిందా అని కమల్ అడుగుతాడు.
నేను ఇంటి పరువు ని పోగొట్టకుండా రాజేంద్రప్రసాద్ కోడలు అని చెప్పుకున్నాను. భర్త ఒక మంచి కంపెనీలో ఆఫీసర్గా పని చేస్తున్నాడు అని చెప్పుకున్నాను.. ఇతను వచ్చి నేను ఎలక్ట్రిషన్ పని అని చెప్పగానే నా పరువు పోయింది అని పల్లవి సీరియస్గా ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది.. అయితే నీ భర్తగా కాని పని ఏం చేస్తున్నాడని నువ్వు అంతగా ఫీల్ అయిపోతున్నావు. పరుతకు పని రౌడీయిజం గుండాయిజం ఏం చేయలేదు కదా నువ్వెందుకు ఇంతగా అరుస్తున్నావు అని పల్లవిని అవని అడుగుతుంది. అక్షయ బావ ఖాళీగా ఉన్న బిజినెస్ కోసం చూస్తున్నాడని నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. నా భర్త ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడంటే నాకెంత పరువు తక్కువ అని అంటుంది. ఆ భర్త కూడా అలాంటి పని చేస్తే నీలాగా ఒక్కరికి కాదు లక్ష మందికి నేను చెప్పుకుంటాను అని అవని దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్తుంది.
Also Read : నిజం కక్కేసిన మనోజ్.. సత్యంకు అడ్డంగా దొరికిన ప్రభావతి.. నగలను అమ్మేస్తారా..?
నువ్వు చేస్తున్న పని కరెక్టే కన్నయ్య నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు అని అవని కమల్ తో అంటుంది. ఇక భానుమతి ఇంట్లో వాళ్ళందరికీ ఆవకాయ అన్నం కలిపి గోరుముద్దలు పెడుతుంది. అందరూ చాలా బాగుంది అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా చక్కటి భోజనం పెట్టారు అత్తయ్య చాలా మంచి పని చేశారు చాలా సంతోషంగా ఉన్నాము అని అంటారు పార్వతి. బామ్మ ఇలానే రోజు పెట్టవే చాలా బాగుంది అని కమల్ అంటాడు. ఇలానే రోజు తింటే మోషన్స్ అవుతాయి రా ఎదవ అని భానుమతి అంటుంది. మొత్తానికి కుటుంబం మొత్తం ఒకచోట చరి చాలా సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..