E-Paper
Advertisement

BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?

BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?
Advertisement

మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కొత్త టాపిక్ తెరమీదకు వచ్చింది. బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని పథకం రచించింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకోవాలని కాషాయ పార్టీ ఎదురుచూస్తున్నది. అయితే, ఉత్తర తెలంగాణలో బీజేపీ కేడర్ బలంగా ఉన్నది. గత సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 6 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలు అక్కడి నుంచే వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బీజేపీ బలంగానే ఉన్నది. ఇక దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా కేడర్ లేదు. అందుకే కేవలం పట్టణ ప్రాంతాలపైనే బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తున్నది.

సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ..

మున్సిపల్ ఎన్నికలను కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల వలే ట్రీట్ చేసినట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల కోసం ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జాతీయస్థాయి నేతలు వచ్చారు.సేవ్ తెలంగాణ- ఓట్ ఫర్ బీజేపీ అనే నినాదంతో  కాషాయ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఎంపీ నవనీత్ కౌర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఈ విషయం పక్కనబెడితే బీజేపీకి, ఎంఐఎం పార్టీకి మధ్య అంతర్గత డీల్ కుదిరిందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు విరుద్ధ భావజాలం కలిగినవి. ఎంఐఎం ముస్లింల పార్టీ.. ఆ పార్టీ పేరులోనే ముస్లిం అని ఉంటుంది. బీజేపీని హిందువుల పార్టీగా కొందరు అభివర్ణిస్తుంటారు. ఎంఐఎం ముస్లింల ఓట్లును మాత్రమే ఆశిస్తే.. బీజేపీ హిందువుల ఓట్లను ఆశిస్తుంటుందని చాలా మంది అంటుంటారు.

ఎంఐఎం వల్లే బీజేపీ గెలుస్తున్నదా?

Advertisement

రాష్ట్రంలో జరిగిన బైపోల్స్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రతిసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. అసెంబ్లీలో ఆ పార్టీ పెట్టే బిల్లులకు మద్దతుగా ఉంటున్నది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ నేతలు.. కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటేనని చెబుతూ హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు చూస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో స్పష్టంచేశారు.

BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!

Advertisement

బీజేపీకి ఎంఐఎం పార్టీ అంటే లైఫ్ లైన్ అని.. అసదుద్దీన్ దేవుడి వంటి వాడని పేర్కొన్నారు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం నిల్చుంటే తప్పకుండా అక్కడ బీజేపీ గెలుపు ఖాయం అని లెక్కలు చెబుతున్నాయి.బిహార్ జనరల్ ఎలక్షన్స్, మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో ఎంఐఎం పోటీ చేసి ముస్లిం ఓట్లను పెద్దఎత్తున చీల్చింది. ఫలితంగా ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీలకు పడలేదు. ఇక హిందువుల ఓట్లు మాత్రం బీజేపీకే వచ్చాయి. తద్వారా ప్రతి ఎన్నికల్లోనూ ఎంఐఎం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రావాల్సిన ముస్లిం ఓట్లను దక్కకుండా చేస్తున్నదని.. ఫలితంగా హిందువుల ఓట్లతో బీజేపీ గెలుస్తున్నదని టాక్ వినిపిస్తోంది. అందుకే బీజేపీకి ఎంఐఎం పార్టీ లైఫ్ లైన్ అని సీఎం వ్యాఖ్యానించడం పలువురిని ఆలోచనకు గురిచేసింది.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×