E-Paper
Advertisement

Sree Vishnu: ఇండస్ట్రీలో బజ్ రేపుతున్న శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా.. నిర్మాత ఎవరంటే?

Sree Vishnu: ఇండస్ట్రీలో బజ్ రేపుతున్న శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా.. నిర్మాత ఎవరంటే?
Advertisement

Sree Vishnu: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న హీరో శ్రీవిష్ణు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి హిట్స్ తర్వాత శ్రీవిష్ణు మార్కెట్ రేంజ్ గణనీయంగా పెరిగింది. ఈ క్రేజ్‌ను గమనించిన నిర్మాత నాగవంశీ, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన బజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వెరైటీ సినిమాలు చేస్తూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణు సితార బాట పట్టడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సంక్రాంతికి సితార బ్యానర్ లో వచ్చన ‘అనగనగా ఒక రాజు’ మంచి హిట్ సాధించుకుంది. దీంతో వరుస పరాజయాలు చూస్తున్న సితారకు కామెడీ జోనర్ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అదే విధంగా మరో సినిమా కూడా ఇదే జోనర్ లో తీసేందుకు సితార వంశీ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Read also-Pragya Jaiswal : అడవుల్లో ప్రగ్యా జైస్వాల్ అడ్వెంచర్.. ఫోటోలు వైరల్..

Advertisement

ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో ఈ నెల 13న రాబోతున్న ‘ఫంకీ’పై నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా కామెడీ జానర్లోనే రానుంది. తర్వాత రానున్న సినిమాలు కూడా అదే జానర్ లో తెచ్చేందుకు నాగ వంశీ సన్నాహాలు చేసుకుంటున్నారు. సాధారణంగా శ్రీవిష్ణు సినిమాలకు పరిమితమైన బడ్జెట్, బిజినెస్ సర్కిల్ ఉంటుందనే టాక్ ఉంది. కానీ, సితార వంటి పెద్ద బ్యానర్ రంగంలోకి దిగితే ప్రమోషన్లు థియేట్రికల్ రిలీజ్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. దీనివల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో (టూ స్టేట్స్) ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. పెద్ద నిర్మాణ సంస్థ తోడవ్వడం శ్రీవిష్ణు కెరీర్‌కు ఒక పెద్ద బూస్ట్‌లా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-Sonu Sood: కమెడియన్ రాజ్ పాల్ పరిస్థితి చూసి అడ్వాన్ ఇచ్చిన సోనుసూద్.. ఏమన్నారంటే?

Advertisement

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ముగిశాయని, త్వరలోనే దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకునే శ్రీవిష్ణు, పక్కాగా బిజినెస్ లెక్కలు వేసే నాగవంశీ కలయికలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గనుక సక్సెస్ అయితే శ్రీవిష్ణు టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×