E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!

BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోయాయి. అనంతరం పలు పార్టీల నేతలు ప్రలోభాలు మొదలెట్టారు. ఓటర్లకు సుక్క, ముక్క పంపిణీ చేయడం ప్రారంభించినట్టు పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పలు పార్టీల నేతలు తీవ్రంగా శ్రమించారు. కొందరైతే ఏకంగా ఓటర్ల కాళ్లు కూడా మొక్కినట్టు సమాచారం. తమకు ఓటు వేసి గెలిపిస్తే మీ కష్టాలన్నీ పోతాయనే రేంజులో కొన్ని పార్టీల ప్రచారం సాగగా.. అధికార పార్టీ మాత్రం తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సీఎం రేవంత్ ప్రచార సభల్లో చెప్పిన వాటినే జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఫాలో అయినట్టు తెలుస్తున్నది.

బీఆర్ఎస్ కథేంటి?

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు.. చివరి నాలుగు రోజుల్లో ప్రచారం నిర్వహించినట్టు సమాచారం. మొన్నటివరకు సిట్ కేసులతో వీరిద్దరూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ప్రచారం పక్కనబెట్టి ఆ భారమంతా జిల్లా ఇన్‌చార్జిల మీద వేశారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని ఆదేశించినట్టు టాక్. ఈ క్రమంలోనే వారంతా నిమగ్నమయ్యారు. మాజీ మంత్రులు అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. వారు ఈసారి ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదని తెలుస్తున్నది. ప్రచారంలో పార్టీ వెనుకబడి ఉందని గుర్తించిన కేటీఆర్, హరీశ్ రావులు ఒకే రోజున రెండు, మూడు జిల్లాల్లో పర్యటించి ఆగమేఘాల మీద ప్రచారం చేశారు.

బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా?

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. అందులో ఒకటి బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అనే డైలాగ్.. ఎందుకంటే గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు కొత్తగా తమకు ఓటు వేస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ ఓటర్లను తప్పుదోవ పట్టించడంపై సీఎం ఫైర్ అయ్యారు. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ..కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీ పెత్తనమే ఉండేది. మరి ఇన్నేళ్లూ ఏం చేశారు? అభివృద్ది ఎందుకు చేయలేదు. వార్డులు, డివిజన్లలో రోడ్లు వేయడం, చెత్త క్లీనింగ్, క్లీన్ వాటర్, శానిటేషన్ వంటి చర్యలు తీసుకోవడంలో మిమ్మల్ని ఎవరు ఆపారు? కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు ఎక్కడ పోయాయని సీఎం ప్రశ్నించారు.

Jagan: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. అదే ఇష్యూ, కాకపోతే వేర్వేరుగా ప్రయత్నాలు

పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయని వాళ్లు.. ఇప్పుడు అధికారం పోయాక చేస్తారని గ్యారంటీ ఏంటని సీఎం నిలదీశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అని స్పష్టంచేశారు.అధికారపార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే.. ప్రభుత్వం తమదేనని, మున్సిపల్ మంత్రిగా తానే ఉన్నందున.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేస్తానని.. తద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం రేవంత్ పలు సందర్భాల్లో ఊటంకించారు. అధికారంలో లేని పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే నిధులు ఆలస్యం అవుతాయని.. అందుకే ఓటు వేసే ముందు ఆలోచన చేసి వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు సూచించారు.ఇకపోతే బీఆర్ఎస్‌కు ఓటు వేసినా.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినా ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తే నిధులు రావడం కష్టతరం అవుతుంది. సీఎం అన్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు కేంద్రరాష్ట్రాల నిధులతో డెవలప్మెంట్ చేయకుండా ఇప్పుడు చేస్తామంటే ఏంటి అర్థం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×