Mysore Sandal: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL)కి చెందిన ఐకానిక్ ‘మైసూర్ శాండిల్ సోప్’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఆమె సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ శాండిల్ సోప్ కు కర్ణాటకకు సండంధించిన వారు కాకుండా బయట వారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడంపై అక్కడి ప్రజలు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక్కడ అంత పనిచేసేవారు లేరా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మైసూర్ సాండల్ సోప్ అనేది కర్ణాటక వారసత్వానికి ప్రతీక. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి కన్నడ చిత్ర పరిశ్రమకు (శాండల్‌వుడ్) చెందిన నటిని కాకుండా తమన్నాను ఎంపిక చేయడంపై చాలా మంది కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read also-Shalini Pandey: ఘాటు అందాలతో గత్తరలేపుతున్న షాలిని.. కుర్రాళ్ళు ఏమైపోతారో..
తమన్నా కంటే కన్నడ మూలాలున్న ప్రణిత సుభాష్ వంటి నటీమణులు ఈ ప్రకటనకు మరింత సరిపోతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “కర్ణాటకలో కూడా అందమైన నటీమణులు ఉన్నారు, స్థానిక కన్నడిగులను ఎందుకు తీసుకోలేదు?” అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ బ్రాండ్‌ను ఉత్తర భారతదేశంలో మరింత విస్తరించడానికి యువ వినియోగదారులను ఆకర్షించడానికి తమన్నా సరైన ఎంపిక అని వారు భావిస్తున్నారు. అందుకనే తమన్నాను ఎంపిక చేసినట్లు వారు చెబుతున్నారు.
Read also-Sonu Sood: కమెడియన్ రాజ్ పాల్ పరిస్థితి చూసి అడ్వాన్ ఇచ్చిన సోనుసూద్.. ఏమన్నారంటే?
2030 నాటికి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించాలని, ఈ క్రమంలో తమన్నా పాన్-ఇండియా ఇమేజ్ తమకు సహాయపడుతుందని కర్ణాటక మంత్రి ఎం.బి. పాటిల్ పేర్కొన్నారు. మరోవైపు, కొంతమంది నెటిజన్లు తమన్నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని, తద్వారా కర్ణాటక బ్రాండ్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని వారు వాదిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక స్థానిక వారసత్వం ఉన్న బ్రాండ్‌కు స్థానిక నటిని కాకుండా బయటి వ్యక్తిని తీసుకోవడం వల్ల ఈ వివాదం తలెత్తింది. అయితే ఈ వివాదంపై రానున్న రోజుల్లో స్పస్టత రావాల్సి ఉంది.