E-Paper
Advertisement

Drugs: టాలీవుడ్‌లో డ్రగ్స్ దడదడ.. నెక్ట్స్ ఎవరు? గుట్టు లాగుతున్న పోలీసులు..

Drugs: టాలీవుడ్‌లో డ్రగ్స్ దడదడ.. నెక్ట్స్ ఎవరు? గుట్టు లాగుతున్న పోలీసులు..
Advertisement
tollywood drugs

Drugs case news in telugu(Tollywood celebrity news): డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. దీంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ లింక్స్ మరోసారి బయటపడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో భయం మొదలైందనే చర్చ జరుగుతోంది. గత నెల 5న మాదాపూర్‌ ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులు నానక్‌రామ్ గూడ సమీపలో 300 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రాకేష్ రోషన్ వాట్సప్ ద్వారా కేపీ చౌదరితో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు.

ఇక కేపీ చౌదరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, గతంలో అరెస్ట్ చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు సెల్‌ఫోన్లను నుంచి కాల్ డేటాను విశ్లేషించనున్నారు. అటు కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల జాబితా కూడా తయారు చేస్తున్నారు పోలీసులు. మొత్తం 9 సెల్‌ఫోన్ల ఆధారంగా డ్రగ్స్ ముఠాతో లింకులను పోలీసులు బయటికి తీయనున్నారు. గోవాలో డ్రగ్స్ సరఫరా చేసే గాబ్రియేల్ కోసం వేట కొనసాగిస్తున్నారు. గాబ్రియేల్ నుంచి నగరానికి చెందిన తొమ్మిది మంది డ్రగ్స్ కొనుగోలు చేశారని తేల్చారు. కేపీ చౌదరి నుంచి తీగ లాగితే.. ఇంకెందరి టాలీవుడ్ ప్రముఖుల గుట్ట రట్టవుతుందో?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×