BigTV English

BCCI Hunting for Sponsor : టీమిండియా స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట..

BCCI Hunting for  Sponsor : టీమిండియా స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట..
BCCI hunting for Team India sponsor


BCCI Hunting for Sponsor : ముఖ్యంగా క్రికెట్ రంగంలో ఏ స్పాన్సర్లు ఎప్పుడు మనసు మార్చుకొని తప్పుకుంటారో తెలియదు. కానీ దానికి తగినట్టుగానే ఖాళీగా ఉన్న స్పాన్సర్‌షిప్‌ను అందుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు అన్నీ క్యూ కడతాయి. ఐపీఎల్‌లోనే కాదు నేషనల్ క్రికెట్ టీమ్ విషయంలో కూడా స్పాన్సర్‌షిప్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. తాజాగా నేషనల్ టీమ్‌ను సపోర్ట్ చేయడం కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది బీసీసీఐ.

ఆసక్తి ఉన్న బిజినెస్ హైజ్‌లు అన్ని స్పాన్సర్‌షిప్ కోసం టెండర్లను అప్లై చేసుకోవచ్చని బీసీసీఐ ప్రకటించింది. గత ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎడ్యుకేషన్ బిజినెస్‌లో క్రేజ్ సంపాదించుకున్న ‘బైజూస్’.. టీమ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇండియన్ మెన్ టీమ్‌ కోసం 35 మిలియన్ డాలర్ల డీల్‌ను మాట్లాడుకుంది బైజూస్. ఆ రేంజ్‌లో పెట్టుబడి పెట్టింది కాబట్టే.. బైజూస్‌కు మెన్ టీమిండియా జెర్సీల వల్ల సరిపడా ప్రమోషన్ లభించింది.


నేషనల్ టీమ్ లీడ్‌కు స్పాన్సర్ రైట్స్ కోసం బీసీసీఐ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఈ వేలాన్ని కావాల్సిన డాక్యుమెంట్‌ ధర రూ.5 లక్షలు అని, ఇది నాన్ రిఫండెబుల్ అని బీసీసీఐ ఈ ప్రకటనలో తెలిపింది. ఈ డాక్యుమెంట్‌ను కొనడానికి చివరి తేదీ జూన్ 26 అని తెలిపింది. ముందుగా ఐటీటీని కొనుక్కొని, రూల్స్‌ను పాటించిన వారు ఎవరైనా.. ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని బీసీసీఐ ప్రకటనలో తేల్చింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×