BigTV English

Kavitha: కవితకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో ఈడీ కేవియెట్ పిటిషన్.. ఇక చిక్కేనా?

Kavitha: కవితకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో ఈడీ కేవియెట్ పిటిషన్.. ఇక చిక్కేనా?

Kavitha: కవితకు కష్టాలు తప్పేలా లేవు. ఎంతగా విదిలించుకుంటున్నా.. ఈడీ వదలడం లేదు. ఇప్పటికే ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు కవిత. మహిళ హక్కులంటూ, ఇంటి దగ్గరే విచారణ అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 24న విచారణ జరగనుంది. అక్కడ కాస్తైనా ఊరట లభిస్తుందనేది కవిత ఆశ.


తాజాగా, ఆశపైనా ఈడీ నీళ్లు జల్లింది. కవిత పిటిషన్‌పై సుప్రీంలో ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని పిటిషన్‌లో కోరింది. దీంతో, కేవలం కవిత తరఫు వాదనలు మాత్రమే వినకుండా.. ఇప్పుడిక ఈడీ అభ్యంతరాలను సైతం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు. అదే జరిగితే.. ఈడీ కార్యాలయంలో కాకుండా.. ఇంటి దగ్గరో, వీడియో కాన్ఫరెన్స్‌లోనో విచారణ జరగాలనే కవిత డిమాండ్ ఆచరణలోకి వచ్చే ఛాన్సెస్ తక్కువే అంటున్నారు. ఈడీ గట్టిగా వ్యతిరేకించవచ్చని తెలుస్తోంది.

మరోవైపు, మార్చి 20న కవితను విచారణకు పిలిచింది ఈడీ. మరి, ఆ రోజైనా కవిత వస్తుందా? ఒకవేళ రాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 24 వరకు ఆగుతుందా? ఈలోగానే అరెస్ట్ చేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.


MLC: పొలిటికల్ ‘చిరంజీవి’.. కోచింగ్‌సెంటర్ నుంచి ‘కౌన్సిల్’ వరకు..

UP: అత్తవారింటికి రాను.. వరుడికి షాకిచ్చిన వధువు

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×