BigTV English

Amritpal: 100 వాహనాలతో ఛేజింగ్.. వెంటాడి, వేటాడి.. అమృత్‌పాల్ అరెస్ట్

Amritpal: 100 వాహనాలతో ఛేజింగ్.. వెంటాడి, వేటాడి.. అమృత్‌పాల్ అరెస్ట్

Amritpal: 100కి పైగా పోలీస్ వెహికిల్స్.. వందల సంఖ్యలో పోలీసులు.. సినిమా సీన్లను తలపించే దృశ్యాలు.. ఛేజింగ్ చేసి మరీ అరెస్టులు.. 7 జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత.. ఆర్గనైజ్ చేస్తున్న సెంట్రల్ హోంమినిస్ట్రీ. ఇది.. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్, సిక్కు రాడికల్ లీడర్.. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ చేసిన వైనం. సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కనిపించే సీన్లను.. రియల్ గా చూపించారు.. పంజాబ్ పోలీసులు. వెంబడించి మరీ అమృత్ పాల్ కు సంకెళ్లు వేశారు.


స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే.. సినిమా హిట్ అయినట్టే. సరిగ్గా దాన్నే ఫాలో అయ్యారు.. పంజాబ్ పోలీసులు. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. ప్రభుత్వానికే సవాల్ గా మారిన అమృత్ పాల్ ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు.. ఆయన అనుచరులను కూడా కటకటాల్లోకి నెట్టేశారు. శనివారం హై టెన్షన్ గా మారిన ఈ ఘటన.. పంజాబ్ లోనే కాదు.. ఓవరాల్ ఇండియాలోనే మేయిన్ స్టోరీ అయ్యింది.

పంజాబ్ లో ఖలిస్తాన్ అనుకూల వాదాన్ని విస్తరిస్తూ.. తన ప్రసంగాలతో రెచ్చగొడుతున్న అమృత్ పాల్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే తనను ధమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ సవాల్ కూడా విసిరిన అమృత్ పాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 7 జిల్లాల్లో అమృత్ పాల్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. చివరకు జలంధర్ జిల్లా షాకోట్ తాలూకాలోని మెహత్ పూర్ గ్రామంలో దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆలస్యం చేయకుండా వందలాదిగా పోలీసులు.. ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సున్నితమైన ప్రాంతాలను ముందే గుర్తించి.. పోలీసుల పహారా పెంచారు.


అయితే తాము ఉన్న ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారనే సమాచారం అందుకున్న అమృత్ పాల్, అతడి అనుచరులు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు.. 100కి పైగా వాహనాల్లో ఛేజింగ్ స్టార్ట్ చేశారు. కనిపించిన వారిని కనిపించినట్టే అదుపులోకి తీసుకున్నారు. చివరకు చిక్కిన అమృత్ పాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు. సినిమా సీన్లను తలపించేలా.. వెంటాడి, వేటాడారు. అమృత్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు అనుచరులకు కూడా సంకెళ్లు వేశారు. ఇక ఈ ఆపరేషన్ ను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. అమృత్ పాల్ అరెస్ట్ వరకు.. పోలీసులకు కావాల్సిన ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ సహకరించింది.

నటుడు దీప్‌ సిధూ ప్రారంభించిన వారిస్‌ పంజాబ్‌ దే అనే రాడికల్‌ ఆర్గనైజేషన్‌ను.. ప్రస్తుతం అమృత్‌పాల్‌ కొనసాగిస్తున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో దీప్‌ సిధూ ప్రాణాలు కోల్పోగా.. ఆ స్థానంలో అమృత్ పాల్ కొనసాగుతూ.. స్థానిక యువతను రెచ్చగొడుతున్నాడు. ఖలిస్థానీ ఉద్యమం వైపు ప్రోత్సహిస్తున్నాడు. ఈ క్రమంలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం.. ఖలిస్థాన్ ఎప్పటికైనా ఏర్పాటవుతుందంటూ మాట్లాడంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ప్రజలంతా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా సహకరించాలని పంజాయ్ పోలీసులు కోరారు. శాంతిభద్రతలను కాపాడేందుకే తాము పనిచేస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని అభ్యర్థించారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×