BigTV English
Advertisement

Mynampalli On Ktr: కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. మైనంపల్లి హాట్ కామెంట్స్

Mynampalli On Ktr: కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. మైనంపల్లి హాట్ కామెంట్స్

కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని, మళ్లీ అమెరికాకు వెళ్లి బేసిన్లు తోముకోవాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి రావొద్దని హెచ్చరించారు. కార్యకర్తల జోలికొస్తే నేరుగా కేటీఆర్ నే అటాక్ చేస్తామన్నారాయన. కేటీఆర్, హరీష్ రావు ఇళ్లపై దాడి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ అని, తమ కార్యకర్తల జోలికొస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు మైనంపల్లి.


చిచ్చు పెడతారా..?
బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు మైనంపల్లి. అసలు ఏం పీకనీకి ఆంధ్రాలో బీఆర్ఎస్ ఆఫీస్ తెరిచారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటూ ఆంధ్రాలో అడుగు పెట్టిన గులాబి నేతలు.. ఇప్పుడు పక్క రాష్ట్ర పార్టీలను విమర్శిస్తున్నారని, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రెడ్ బుక్ రాస్తావా..?
రెడ్ బుక్ రాస్తా అంటూ కేటీఆర్ రెచ్చిపోతున్నారని, రెడ్ బుక్ రాసి పీకుతావా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు మైనంపల్లి. కేటిఆర్ ది నరం లేని నాలుక అని, ఆయన డ్రగ్స్ తీసుకొని మాట్లాడతాడని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ ని, కేటీఆర్ ని ఛీ కొట్టారని అన్నారు. గాలికి మాట్లాడే వెధవకి, వేరే వాళ్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంటుందన్నారు. సిరిసిల్లలో కూడా కేటిఆర్ ను చెప్పుల తో కొట్టే రోజులు వస్తాయన్నారాయన.

పవర్ లేకపోతే బతకలేరా..?
అధికారం లేకుండా కేటీఆర్ బతకలేకపోతున్నారని, అందుకే పదే పదే బయటకొచ్చి విమర్శలు చేస్తున్నారని అన్నారు మైనంపల్లి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన షాడో సీఎంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ని పక్కనపెట్టి, కేటీఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగేవని, కేటీఆర్ పెత్తనాన్ని ఆ పార్టీలో చాలామంది నేతలు ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు అధికారం పోయాక కేటీఆర్ కి ఏం చేయాలో తోచడం లేదన్నారు. కేటీఆర్ అరాచకాలమీద బుక్ రాసి గడప గడపకు పంచుతానని చెప్పారు మైనంపల్లి. కేటీఆర్ కచ్చితంగా జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమన్నారు. ఈపాటికే కేటీఆర్, హరీష్ రావుని అరెస్ట్ చేయాల్సి ఉందని, కానీ ఎందుకో లేటైందన్నారు. కరీంనగర్ లో మిట్ట మధ్యాహ్నం బ్రాహ్మణ కుటుంబాన్ని నరికి చంపిన చరిత్ర కేటీఆర్ ది అని చెప్పారు. జర్నలిస్టు ఆత్మహత్యకు కూడా కారణం వారేనన్నారు మైనంపల్లి హన్మంతరావు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కేటీఆర్ కి ఇటువైపు నుంచి కూడా అంతే ఘాటుగా బదులు చెబుతున్నారు నేతలు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలపై బీఆర్ఎస్ నేతల దాడిని కూడా మైనంపల్లి ఖండించారు. ఇలాగే దాడులు కొనసాగితే టీ న్యూస్ పై కూడా దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఎన్నికలు జరిగి రెండేళ్లు కూడా పూర్తికాకముందే తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో మరింత అలజడి రేపాయి.

Related News

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Revanth Reddy Birthday: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

Bandi Sanjay: కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. జూబ్లీహిల్స్ ఈసీలో రైడ్స్ పై బండి సంజయ్ స్ట్రాంగ్ రియాక్షన్

Marri Janardhan Reddy: 2 డ్రాయర్లు, 2 బనియన్స్ నా ఇంట్లో దొరికినవి ఇవే.. మర్రి జనార్దన్ షాకింగ్ కామెంట్స్

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Ponnam Prabhakar: షాకింగ్ ఓట్ల గారడీ.. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Big Stories

×