BigTV English

Fish Venkat Death: మా నాన్న చావుకు వాళ్లే కారణం… దారుణంగా మోసం చేశారు!

Fish Venkat Death: మా నాన్న చావుకు వాళ్లే కారణం… దారుణంగా మోసం చేశారు!

Fish Venkat Death: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) గత రాత్రి అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే తన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. ఇలా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతోనే ఈయన పరిస్థితి విషమించి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఫిష్ వెంకట్ చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలి అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇటు సినిమా ఇండస్ట్రీని అటు ప్రభుత్వాన్ని కూడా కోరారు. అయితే ప్రభుత్వం భరోసా కల్పించినా, సరైన సమయంలో కిడ్నీ దొరకకపోవడంతోనే ఆయన మరణించారని తెలుస్తోంది.


స్పందించని చిత్రపరిశ్రమ…

ఇక ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన తోటి నటీనటులు సన్నిహితులు ఆయన ఇంటికి చేరుకొని ఫిష్ వెంకట్ ను చివరిసారిగా చూసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఎవరూ కూడా ఇప్పటివరకు ఫిష్ వెంకట్ మరణం గురించి ఎక్కడ స్పందించకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఫిష్ వెంకట్ మరణం గురించి ఆయన కుమార్తె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.


వ్యాపారంలో మోసం…

ఫిష్ వెంకట్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిజినెస్లను కూడా చేశారు. అయితే ఈయన  చెరువులను తవ్వించి చేపల బిజినెస్ (Fish Business)ప్రారంభించారు. ఈ బిజినెస్ చేస్తున్న నేపథ్యంలోనే ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు కూడా వచ్చింది. ఇలా బిజినెస్ చేస్తున్న సమయంలో తన నుంచి చేపలని ఉచితంగా తీసుకువెళ్లి వ్యాపారంలో కూడా చాలామంది మోసం చేశారని అలా వ్యాపారాలలో నష్టపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు ఆయన కుమార్తె తెలియజేశారు. ఇలా వ్యాపారంలో మోసం చేయకపోయి ఉంటే నాన్నకు నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదని కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వ్యాపారంలో కూడా నాన్నను చాలా దారుణంగా మోసం చేశారని తెలిపారు.

కిడ్నీ ఫెయిల్యూర్…

ఫిష్ వెంకట్ వ్యాపారాలలో నష్టపోయి అనారోగ్య సమస్యల కారణంగా సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన చికిత్స కూడా చేయించుకోలేకపోయారని చెప్పాలి. కిడ్నీ ఫెయిల్యూర్ (Kidney Failure) అవ్వడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. గత 20 రోజులుగా ఈయన హాస్పిటల్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇలా చికిత్స అందుతున్నప్పటికీ ఫిష్ వెంకట్ పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారు. ఇలాంటి గొప్ప నటుడి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే గబ్బర్ సింగ్ కమెడియన్స్ మొత్తం ఆయన ఇంటికి చేరుకొని ఫిష్ వెంకట్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.

Also Read: Fish Venkat: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత!

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×