E-Paper
Advertisement

Congress : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై తుది కసరత్తు.. అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ..

Congress : కాంగ్రెస్ సెకండ్  లిస్ట్ పై తుది కసరత్తు.. అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ..
Advertisement

Congress: ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యేల అభ్యర్థల రెండో జాబితాపై తుది కసరత్తు జరిగింది. సోనియా, మల్లిఖార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మురళీధరన్
ఏఐసిసి కార్యాలయంలో జాబితాపై చర్చించారు. రెండో జాబితాలో 16 నుంచి 20 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు కసరత్తు పూర్తి చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ… విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికల వల్లే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Advertisement

కాంగ్రెస్ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఒకసారి ప్రకటిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజా రాజకీయ పరిణాామాల నేపథ్యంలో విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించారు. మిగిలిన 60 స్థానాల అభ్యర్థుల ఎవరనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పు కోనున్నారు. గురువారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మోత్కుపల్లి నరసింహులు కలిశారు. అధిష్ఠాన పెద్దలతో మాట్లాడిన తర్వాతే చెప్తా అన్నారు మోత్కుపల్లి. మోత్కుపల్లిని వెంకట్ రెడ్డి ఏఐసీసీ ఆఫీసుకు తీసుకొచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×