BigTV English

Martin Luther King Review : ఎమోషనల్ యాంగిల్ ట్రై చేసిన సంపు క్లిక్ అయ్యాడా..? మార్టిన్ లూథర్ కింగ్ ఎలా ఉందంటే..?

Martin Luther King Review : ఎమోషనల్ యాంగిల్ ట్రై చేసిన సంపు క్లిక్ అయ్యాడా..?  మార్టిన్ లూథర్ కింగ్ ఎలా ఉందంటే..?

Martin Luther King Review : పండగ కు అన్ని పెద్ద సినిమాలు సందడి చేసి వెళ్ళాయి. గత వారం మొత్తం పెద్ద సినిమాల రిలీజ్ తో థియేటర్లు హడావిడిగా ఉన్నాయి. మరి నవంబర్లో తిరిగి మళ్లీ పెద్ద సినిమాల పోరు మొదలయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక మిగిలిన ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు తమ ప్రతాపాన్ని చూపడానికి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా మన ముందుకు వచ్చిన చిత్రమే మార్టిన్ లూథర్ కింగ్. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు అన్నిటిలోకి కాస్త బజ్ క్రియేట్ చేసిన చిత్రం ఇదే.


తమిళ్ లో మంచి సక్సెస్ సాధించిన మండేలా మూవీకి రీమిక్ గా వస్తున్న ఈ చిత్రం టీజర్ ,ట్రైలర్స్ బాగా ఆకట్టుకున్నాయి. పైగా ఇందులో నటిస్తోంది సంపూర్ణేష్ బాబు కావడంతో.. కామెడీకి ఫుల్ స్కోప్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేయొచ్చు. అయితే కామెడీ నుంచి బయటకు వచ్చి మొదటిసారిగా సంపూర్ణేష్ ఎమోషనల్ యాంగిల్ ని కూడా ఈ మూవీలో ట్రై చేస్తున్నాడు. ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఓ లుకేద్దాం పదండి..

మూవీ: మార్టిన్ లూథర్ కింగ్


తారాగణం: సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా 

దర్శకత్వం: పూజ కొల్లూరు 

 నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్స్

 సినిమాటోగ్రఫి: దీపక్ యరగెరా 

మ్యూజిక్: స్మరణ్ సాయి 

రిలీజ్ డేట్: 2023-10-27

కథ:

పడమరపాడు అనే ఒక గ్రామంలో చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి స్మైల్(సంపూర్ణేష్ బాబు).. అతని ఫ్రెండ్ బాట అనే కుర్రాడితో కలిసి జీవిస్తుంటాడు. ఇతనికి ఇల్లు, కుటుంబం లాంటివి ఏమీ ఉండవు. ఎక్కడ ఊర్లో వాళ్ళు తనని వెళ్లగొడతారో అన్న భయంతో ఎప్పుడూ వాళ్లకు అణిగిమణిగి చెప్పిన పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. మరోపక్క చెప్పులు కుట్టి సంపాదించిన డబ్బుతో ఒక పెద్ద చెప్పుల షాపు పెట్టుకోవాలి అని కలలు కంటూ ఉంటాడు.

అందుకే ఎంతో కష్టపడి డబ్బులు కూడా పెడతాడు కూడా. అయితే స్మైలీ దాచుకున్న డబ్బును ఎవరో అజ్ఞాత వ్యక్తి దొంగిలిస్తాడు. దీంతో అతను ఫ్రెండ్ తో కలిసి డబ్బుని పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవడానికి డిసైడ్ అవుతాడు. అందుకే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డబ్బు దాచుకోవడానికి ఏం చేయాలని కనుక్కుంటాడు. పోస్ట్ ఆఫీస్ ఖాతాలో డబ్బు దాచుకోవడం కోసం ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటివి కావాలని అక్కడ పనిచేసే వసంత(శరణ్య ప్రదీప్) చెబుతుంది. అయితే అసలు పేరు అంటూ లేని స్మైలీ కు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే అతనికి ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ అనే కొత్త పేరు వసంత పెడుతుంది.

ఇదిలా ఉండగా అదే ఊర్లో జగ్గు(నరేష్) , లోకి(వెంకటేష్ మహా) ప్రెసిడెంట్ పదవి కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. అయితే సర్వేలో భాగంగా ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తాయని తేలుతుంది. ఒక్క ఓటు తేడాతో గెలుపు ఎవరిని వరిస్తుంది అన్న డైలమాలో ఉన్న వాళ్లకి మార్టిన్ లూథర్ కింగ్ తగులుతాడు. ఇక వీళ్లిద్దరి వల్ల మార్టిన్ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి ? ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ:

ఇప్పటివరకు మంచి కామెడీ క్యారెక్టర్స్ లో చూస్తూ వచ్చిన సంపూర్ణేష్ బాబుని మొదటిసారి మంచి ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చూసాం. ఈ మూవీలో నిజంగా యాక్టింగ్ లో అతని ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా నిజంగా సంపూ కి ఒక కొత్త ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పవచ్చు. ఇక జగ్గు పాత్రకి నరేష్ ప్రాణం పోశాడు. ఈ మూవీ లో చెప్పాలి అనుకున్న కాన్సెప్ట్ ని ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బాగా కన్వే చేశారు.

ప్లస్ పాయింట్స్:

సంపూర్ణేష్ బాబు యాక్షన్ ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్.

కథ ,కథనం వినూత్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

మూవీ ఎంతో సహజంగా ,చాలా న్యాచురల్ గా తీశారు.

మైనస్ పాయింట్స్:

ఎమోషన్స్ అక్కడక్కడ కాస్త ఓవర్ అనిపిస్తాయి.

మామూలుగా మనం చేసే వాటిని కూడా ఏదో పెద్ద సీరియస్ కష్టమైన పనులు అన్నట్లు చూపించడం జరిగింది.

రేటింగ్: 2.5/5

చివరి మాట:

ఎమోషనల్..కామెడీ ..పొలిటికల్ ..డ్రామా చూడాలి అన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ మూవీ మీకు మంచి ఛాయిస్. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×