E-Paper
Advertisement

Panchayat Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి.. మొదలైన నామినేషన్లు..

Panchayat Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి.. మొదలైన నామినేషన్లు..
Advertisement

Panchayat Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడుత ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా రు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను అధికారులు తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,288 వార్డులకుగాను.. తొలి విడుతలో భాగంగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్, 37వేల 440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న పరిశీలన చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విత్ డ్రాకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే సమయంలో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ సంబంధిత విభాగాలు పూర్తి చేస్తారు.

Advertisement

అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కాకుండా మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రంలోనే తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆయా జిల్లా కేంద్రాల్లో పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గెజిట్ హోదా కలిగిన అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లగా ఆర్వోలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఏఆర్వోలు నియమించారు. నామినేషన్లు స్వీకరించడంతో పాటు అభ్యర్థుల నుంచి క్వాష్ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థుల నామినేషన్లకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా లేదా అని పరిశీలించి.. నిబంధనల ప్రకారం లేకపోతే సంబంధిత అభ్యర్థికి వివరాలు చెప్పి.. సంబంధిత ధృవీకరణ పత్రాలు తెప్పించనున్నారు. అదే విధంగా అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్‌తో పాటు డిపాజిట్ చెల్సించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వెయ్యి, ఇతరులు 2వేల డిపాజిట్ చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్పీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద 250, ఇతరులు 500 చెల్లించాలి. అభ్యర్థులు డిపాజిట్ క్వాష్ రూపంలో ఆర్‌వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ముగ్గురు మృతి..

ఇక తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో కోలాహలం మొదలైంది. ఎవరు పోటీ చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. పోటీకి ఎక్కువ మంది చూపుతున్న గ్రామాల్లో పార్టీల సీనియర్ నేతలు సమావేశమై…ఒకరిని ఎంపిక ప్రక్రియ షురూ చేశారు. వార్డుల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై చర్చిస్తున్నారు.

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×