E-Paper
Advertisement

Harish Rao: తెలంగాణ నదీ జలాల అంశం.. పార్టీ ఆఫీసులో హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Harish Rao: తెలంగాణ నదీ జలాల అంశం.. పార్టీ ఆఫీసులో హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
Advertisement

Harish Rao: తెలంగాణలో నదీ జలాల వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది. దీనిపై అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ విషయంలో ఎవరికి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు. తాజాగా పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి హరీష్‌రావు పీపీ ఇచ్చారు. అందులోని కీలక అంశాలపై ఒక్కసారి చూద్దాం.

పార్టీ ఆఫీసులో హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Advertisement

శనివారం అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ విషయంలో తాము ఏమి చేశాము? గత పాలకులు ఏమి చేశారు? అన్నీ విడమరిచి చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. పాలక పక్షానికి ధీటుగా పార్టీ ఆఫీసులో నదీ జలాలపై ఆదివారం ఉదయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Advertisement

ప్రస్తుతం తాను ఇస్తున్న ఈ ప్రజెంటేషన్ రాజకీయాల కోసం కాదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. సభలో అబద్దాలు చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కీలక అంశాలను ఒక్కసారి చూద్దాం.

బీఆర్ఎస్ పాలనలో తాము చేసింది-హరీష్‌రావు

ఉమ్మడి రాష్ట్రం నుంచి అంటే 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలుగా చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, పదేళ్లకాలంలో 5 లక్షల 71 వేల కొత్త ఆయకట్టు కాగా, అందులో స్టెబులైజేషన్‌ 93 వేలుగా పేర్కొన్నారు.

60 ఏళ్లలో వచ్చింది కేవలం 42 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమేనని, అదే 2014-23 మధ్యకాలంలో బీఆర్‌ఎస్ సాధించిన ఆయకట్టు 31 లక్షల 51వేల ఎకరాలుగా పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెండేళ్లు కరోనా వంటి సమస్యలున్నా ఈ స్థాయిలో సాగు చేశామన్నారు.

అందులో 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఓవరాల్‌గా తొమ్మిదిన్నరేళ్లలో 48 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టు సాధించామన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏడాదికి 57 వేల ఎకరాలు వస్తే, బీఆర్‌ఎస్ పాలనలో లక్షా 81వేల 473 ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామన్నారు.

ALSO READ: గచ్చిబౌలిలో ఎగ్జామ్ థాన్ రన్.. విజేతలకు రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో స్టెబులైజేషన్‌ 93 వేల ఎకరాలు కాగా, బీఆర్‌ఎస్ చేసిన స్టెబులైజేషన్‌ 31 లక్షల 50 వేల ఎకరాలుగా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను పట్టించుకోలేదన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామన్నారు. SRSP స్టేజ్ -2 పేరుకే గానీ ఒక్క నీటి చుక్క రాలేదున్నారు.

కాల్వలు, తుప్పలు మొలిశాయని ఎలాంటి నీరు రాలేదన్నారు. SRSP స్టేజ్-2 కింద కాళేశ్వరం నీళ్లు అందించామన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 84 పెట్టీ నీళ్ల విభజన చేసి తెలంగాణాకు అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు రెండు ప్రాజెక్టులు 11వ షెడ్యూల్‌లో పెట్టిందన్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ముమ్మాటికీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు

నాడు, నేడు తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని, పదేళ్లు కేసీఆర్ కష్టపడి నిర్మించుకున్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 50 TMC ల నీటిని నిలుపుకునే అవకాశమున్నా, కనీసం చిన్న కాలువ కూడా తీయలేదన్నారు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×