Mohan Babu: మోహన్‌బాబు కుటుంబానికి భారీ షాక్ తగిలింది. తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటిపై ఉన్నత విద్యాకమిషన్ 15 లక్షల రూపాయలు జరిమాన విధించింది. నిభందనలకు విరుద్ధంగా విద్యార్ధులనుండి అదనంగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. 2022-23 నుంచి2024 సెప్టెంబర్ వరకు ఏకంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మోహన్‌బాబు యూనివర్సిటీ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత విద్యాకమిషన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి కి ఫిర్యాదు చేశారు. దీంతో రంగం లోకి దిగిన అధికారులు-అదనంగా తీసుకున్న ఫీజులను 15 రోజులలో చెల్లించాలని ఆదేశించారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 15 లక్షల రూపాయల జరిమాన యూనివర్సిటీ కట్టిందని వార్తలు వినిపిస్తునాయి. మరోవైపు యూనివర్సిటి అనుమతి గుర్తింపును రద్దు చేయాలని ఉన్నత అధికారులు సిపారసు జారీ చేశారు.