BigTV English

Rains : తెలుగు రాష్ట్రాల్లో ఆగని వర్షాలు.. ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయంటే..?

Rains : తెలుగు రాష్ట్రాల్లో ఆగని వర్షాలు.. ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయంటే..?

Rains : తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని తెలిపింది.


హైదరాబాద్‌లోనూ భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. వచ్చే రెండు మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

భారీ వర్షాల వల్ల మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి వద్ద మూసీ ఉద్ధృతికి లో-లెవల్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బీమా లింగం కత్వా వద్ద కూడా మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోలేపల్లి – చౌటుప్పల్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.


వరంగల్‌ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులను నిండా ముంచాయి. ఆరుకాలం శ్రమించిన.. కష్టమంతా.. నేలపాలైంది.

ఏపీలోనూ సోమ, మంగళవారాలు అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలు జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మండువేసవిలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×