Bigg Boss :బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులకు నిర్విరామంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో.. భాషతో సంబంధం లేకుండా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు ఎంతోమంది పాపులారిటీకి అతిపెద్ద వేదిక అని చెప్పవచ్చు. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొదలుకొని .. సెలబ్రిటీల వరకు చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కొంతమందికి ఊహించని పాపులారిటీ లభిస్తే.. మరికొంతమంది తమ వ్యక్తిత్వం కారణంగా నెగిటివిటీ కూడా మూటగట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ నడుస్తుండగా.. ఎవరు టాప్ ఫైవ్లోకి వెళ్తారు? విజేతగా ఎవరు నిలుస్తారు? అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డగా కన్నడ బ్యూటీ తనూజ పేరు దక్కించుకోగా.. ఈమె విజేత అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు విజేత ప్రైజ్ మనీ ఎంత? అందులో కట్ అయ్యి వచ్చేది ఎంత? అనే విషయాలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ విజేతకి 50 లక్షల అని ప్రకటించి, ఆమెకు మాత్రం చాలా తక్కువ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎక్కడో కాదు మలయాళం బిగ్ బాస్ షోలో.
also read:SSMB 29 Update: జక్కన్న నుంచి మరో సర్ప్రైజ్… హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది
విషయంలోకి వెళ్తే.. మలయాళం లో మోహన్ లాల్ (Mohan Lal) హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో ముగిసింది. 2025 నవంబర్ 9న ఈ సీజన్ విజేతను ప్రకటించడమే కాకుండా భారీగా నగదు బహుమతి ట్రోఫీ కూడా అందించారు. విజేతగా ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠ నెలకొనగా అన్మోల్ కర్తు (Anmol Karthu) ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో ఈమె ఎంత డబ్బు అందుకుంటుందో అనే చర్చలు జరగగా .. ప్రైజ్ మనీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజేత ఎవరో ప్రకటించక ముందే హోస్ట్ మోహన్ లాల్ విజేతకు 50 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే విజేతకు ఇచ్చే 50 లక్షల మొత్తంలో భారీ కోత విధించినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనుమోల్ కు రూ.42,55,210 మాత్రమే లభించినట్లు సమాచారం. జీఎస్టీ టాక్స్ లు కలుపుకొని ఈ రేంజ్ లో కట్ చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఆమె రెమ్యూనరేషన్ అదనం అని చెప్పాలి. అంతేకాదు ఒక మారుతి సుజుకి విక్టోరిస్ కారు కూడా ఈమె బహుమతిగా అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన అన్మోల్ కర్తుకి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సత్య ఎన్న పెన్ కుట్టి , సురభియుమ్ సుహాసినియుమ్ వంటి మలయాళ సీరియల్స్ లో తన పాత్రలతో మంచి పేరు సొంతం చేసుకుంది. సురభియుమ్ సుహాసినియుమ్ అనే సీరియల్ లో నటించినందుకుగాను ఈమె పాత్రకు 2023లో కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక తర్వాత మహేశుమ్ మారుతీయుమ్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు రియాల్టీ షోలలో కూడా పాల్గొనింది.