Tulsi Leaves: తులసి మొక్కకు.. ఆయుర్వేదంలో ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆధ్యాత్మికంగానే కాక, తులసి మొక్క అపారమైన ఔషధ గుణాలకు నిలయం. అందుకే దీనిని ‘ఔషధ మొక్కల రాణి’ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం.. ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను నమలడం అనేది ఒక మంచి ఆరోగ్య అలవాటు. ఈ చిన్న పనితో మన శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు, వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెంపు:
తులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యూజినాల్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం నమలడం వల్ల ఈ పోషకాలు వేగంగా శరీరంలోకి శోషించుకుంటాయి.
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు: తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
సంక్రమణల నివారణ: దీనిలోని యాంటీ-బాక్టీరియల్, యాంటీ-వైరల్, యాంటీ-ఫంగల్ గుణాలు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. క్రమం తప్పకుండా తులసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ఒత్తిడి ఉపశమనం: తులసిని ఒక అడాప్టోజెన్గా పరిగణిస్తారు. అంటే.. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు శరీరానికి సహాయ పడుతుంది.
కార్టిసాల్ నియంత్రణ: తులసి, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఉదయాన్నే వీటిని నమలడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా ఆందోళన తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
మానసిక స్పష్టత: దీనిలోని గుణాలు నరాల వ్యవస్థను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా మానసిక స్పష్టత , ఉత్సాహం పెరుగుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యం: తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ లక్షణాలు శ్వాస కోశ ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడతాయి.
కఫం నివారణ: ఇది శ్వాస మార్గాలలో పేరుకుపోయిన కఫంను తొలగించి.. ఉబ్బసం, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గొంతు సమస్యలు: గొంతు నొప్పి, దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుదల: ఉదయం తులసి ఆకులు నమలడం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
జీర్ణక్రియ బ్యాలెన్స్: ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, పోషకాలను మెరుగ్గా శోషించడానికి సహాయ పడుతుంది. అంతేకాకుండా.. శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
ఉదర సమస్యలు: కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది.
ఇతర ముఖ్య ప్రయోజనాలు:
రక్త శుద్ధి : తులసి సహజసిద్ధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
నోటి ఆరోగ్యం: తులసిలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు నోటిలోని దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగించి.. నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ : తులసిలోని కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయ పడతాయి.
బరువు తగ్గడం : జీర్ణక్రియ, నిర్విషీకరణ కు తోడ్పడడం వల్ల, ఇది పరోక్షంగా బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది.
తులసి ఆకులను నమలేటప్పుడు.. వాటిని మింగకుండా పారేయడం మంచిది అని కొందరు ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తారు. ఎందుకంటే.. తులసి ఆకుల్లో పాదరసం కొద్ది మొత్తంలో ఉండటం వల్ల అది దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే.. సురక్షితమైన నీటిలో శుభ్రం చేసిన 3-4 తాజా తులసి ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.