Drugs Seized: తెలంగాణలో వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల క్రితం షాద్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఇది మరువక ముందే సైబరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఈ కేసులో 2 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈ వ్యవహరంలో ఒక యువతితో పాటు ఏపీకి చెందిన కానిస్టేబుల్ సహా మొత్తం అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీలో ఓ ముఠా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ SOT పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2 కోట్ల విలువ చేసే 841 గ్రాముల కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
మరోవైపు మల్కాజిగిరిలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.4 గ్రాముల డ్రగ్‌ను పట్టుకున్నా రు. నగరానికి చెందిన ప్రేమ్‌కుమార్, శరత్‌కుమార్‌లు బెంగుళూరుకు చెందిన నితీష్‌అరుణ్‌రాజ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదువు పేరుతో ఇండియాకు వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న నైజిరియన్ ఇమ్మాన్యూయోల్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసారు పోలీసులు.
Also Read: రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్ విజేతలకు తేనేటి విందు, సీఎం రేవంత్ హాజరు
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు మూలంగా నిలుస్తోన్న మాఫియాను కూకటివేళ్లతో పెకళించాలనేది ఎంతో కాలంగా ఉన్న లక్ష్యమే…. కానీ ఆ దిశగా ఎందుకు ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నాం? ఆ వైఫల్యం కారణంగా చిన్నారుల, యువత పై ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయి.? డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం ఆ విషయంలో అసలు ఎక్కడున్నాం? దీనిపై టీఎస్ న్యాబ్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.