Huzurabad Municipal: హుజురాబాద్, స్వేచ్ఛ: అక్షరాస్యులు, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఎంతో జాగ్రత్తగా, నిబంధనల ప్రకారం వేయాల్సిన పోస్టల్ ఓట్లను నిర్లక్ష్యంతో తప్పుగా వేయడం వల్ల అవి చెల్లకుండా పోయాయి. మున్సిపాలిటీలోని 30 వార్డుల పరిధిలో మొత్తం 241 పోస్టల్ ఓట్లు పోలవగా, అందులో 20వ వార్డు నుండి ఒకటి, 29వ వార్డు నుండి మరొకటి చొప్పున మొత్తం రెండు ఓట్లు చెల్లనివిగా (ఇన్వాలిడ్) అధికారులు గుర్తించారు. విద్యావంతులైన అధికారులే ఇలాంటి పొరపాట్లు చేయడంపై ఎన్నికల సిబ్బందితో పాటు సామాన్య ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Medchal Municipal Results: ఎల్లంపేట మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ ముందంజ.. తుది ఫలితాలపై ఉత్కంఠ!
వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే.. ఒకటో వార్డులో కాంగ్రెస్‌కు 4, టీఆర్ఎస్‌కు 1, రెండో వార్డులో కాంగ్రెస్‌కు 1, టీఆర్ఎస్‌కు 2, మూడో వార్డులో టీఆర్ఎస్‌కు 6, నాలుగో వార్డులో కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 4, ఐదో వార్డులో బీజేపీ 1, యాపిల్ గుర్తుకు 1 ఓటు పడ్డాయి. ఆరో వార్డులో టీఆర్ఎస్ 3, బీజేపీ 1 రాగా, ఏడో వార్డులో కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఏసీ గుర్తుకు 3 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 2, తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ 2, పదో వార్డులో కాంగ్రెస్ 4, బీజేపీ 1 ఓటు సాధించాయి. 11వ వార్డులో బీజేపీ 2, కాంగ్రెస్ 1 రాగా, 12వ వార్డులో కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 4, కోటు 3, ఏఐఎఫ్బీ 1, గౌను గుర్తుకు 3 ఓట్లు పడ్డాయి. అత్యంత విచిత్రంగా 13వ వార్డులో ఒక్క పోస్టల్ ఓటు కూడా నమోదు కాలేదు. 14వ వార్డులో కాంగ్రెస్ 4, బీజేపీ 3, 15వ వార్డులో కాంగ్రెస్ 12, టీఆర్ఎస్ 1 ఓటు సాధించాయి.
కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 16వ వార్డులో కాంగ్రెస్‌కు 2, 17వ వార్డులో కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 3, 18వ వార్డులో కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 3, బీజేపీ 1, 19వ వార్డులో కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 1, ఏసీ 1, గౌను 1 ఓటు పడ్డాయి. 20వ వార్డులో కాంగ్రెస్ 1, ఏఐఎఫ్బీ 1, ఏసీ 1, టీఆర్ఎస్ 1 రాగా, ఇక్కడ బీజేపీకి అత్యధికంగా 11 ఓట్లు వచ్చాయి, ఫ్రాక్ గుర్తుకు 1 ఓటు పడగా ఒక ఓటు చెల్లకుండా పోయింది. 21వ వార్డులో కాంగ్రెస్ 4, బీజేపీ 3, టీఆర్ఎస్ 1, 22వ వార్డులో కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 8, బీజేపీ 1, 23వ వార్డులో బీఆర్ఎస్ 5, బీజేపీ 1 ఓట్లు సాధించాయి. 24, 25 వార్డుల్లో కాంగ్రెస్‌కు రెండేసి ఓట్లు రాగా, 25వ వార్డులో బీజేపీకి 14, బీఆర్ఎస్‌కు 6, క్యారం గుర్తుకు 1 ఓటు పడ్డాయి. 26వ వార్డులో కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 4, బీజేపీ 3, 27వ వార్డులో కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 3, 28వ వార్డులో కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 2, బీజేపీ 4, ఏఐఎఫ్బీకి 2 ఓట్లు వచ్చాయి. 29వ వార్డులో బీజేపీ 2, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, ఏఐఎఫ్బీ 1, జనసేన 1, రింగు 1 ఓటు రాగా, ఇక్కడ కూడా ఒక ఓటు ఇన్వాలిడ్‌గా మారింది. ఇక 30వ వార్డులో కాంగ్రెస్ 18 ఓట్లతో ఆధిపత్యం ప్రదర్శించగా, టీఆర్ఎస్‌కు 1, బీజేపీకి 2, యాపిల్ గుర్తుకు 4 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో తుది ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు.
Also Read:Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. స్పాట్ లో ఐదుగురు