E-Paper
Advertisement

అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!

అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!
Advertisement

Chain Snatcher: స్వేచ్ఛ బ్యూరో: పక్కాగా సేకరించిన సమాచారంతో చార్మినార్ జోన్ టాస్క్​ ఫోర్స్ అధికారులు సైదాబాద్ పోలీసులతో కలిసి చెయిన్ స్నాచర్​ ను అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి 3.50లక్షల విలువ చేసే బంగారు గొలుసు, టూ వీలర్​ ను స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ కే.ఎస్​.రావు తెలిపిన వివరాలు

Advertisement

టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ కే.ఎస్​.రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ నివాసి మహ్మద్​ గౌస్​ పాషా గోల్నాక చౌరస్తాలోని ఓ మెకానిక్​ షాపులో బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. దుర్వ్యసనాలు..క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడటంతో మెకానిక్​ గా వస్తున్న ఆదాయం సరిపోలేదు. దాంతో స్నేహితులు, బంధువుల నుంచి అప్పలు తీసుకున్నాడు. ఇటీవలిగా అప్పులు ఇచ్చినవారు బాకీ తీర్చాలని అతనిపై ఒత్తిడి తెస్తుండటంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ కస్టమర్​ కు చెందిన హోండా షైన్​ బైక్ తీసుకుని గడ్డిఅన్నారం ప్రాంతానికి వెళ్లాడు. మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఓ వృద్ధురాలు మెడలో బంగారు గొలుసుతో మిక్సీ రిపేర్ షాప్ వైపు నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించాడు.

నిందితుడు అరెస్ట్

Advertisement

కొద్దిసేపు తరువాత వృద్ధురాలు షాప్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్​ ను రోడ్డు పక్కన పార్క్ చేసి ఆమె వద్దకు వెళ్లాడు. మిక్సీ రిపేర్ షాప్ యజమాని చెప్పాడు. ఆ వెంటనే ఆమె మెడలోని బంగారు గొలుసును గుంజుకుని టూవీలర్ పై పరారయ్యాడు. దొంగిలించిన గొలుసును, వాహనాన్ని తన మెకానిక్ షాప్‌లోనే ఉంచి ఇంటికి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, టాస్క్ ఫోర్స్​ పోలీసులు రంగంలోకి దిగి సైదాబాద్ పోలీసులతో కలిసి సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి నిందితున్ని గుర్తించారు. సోమవారం అతన్ని అరెస్ట్​ చేశారు.

Also Read: అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్

Tags

Related News

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో బియ్యం కొరత.. ధరలు పెంచిన వారిపై 11 కేసులు నమోదు!

Big Stories

Advertisement
×