E-Paper
Advertisement

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!
Advertisement

Civil Rights: జూపాక గ్రామంలో అక్టోబర్ 30న నిర్వహించాల్సిన సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) అవగాహన సదస్సును రద్దు చేసిన బాధ్యులైన మండల అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ప్రతి నెలా 30వ తేదీన..

ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తునికి సమ్మయ్య, సామాజిక ఉద్యమ నేత వేల్పుల ప్రభాకర్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ.. ప్రతి నెలా 30వ తేదీన అధికారులు గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు రాజ్యాంగ హక్కులపై చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ; సమానత్వం, గౌరవం, న్యాయం మరియు వివక్షకు వ్యతిరేకంగా రక్షణ కల్పించే ప్రాథమిక హక్కులను కాపాడాలని పేర్కొన్నారు.

ఆర్టికల్ 17..

Advertisement

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 15 వివక్ష రహిత సమాజాన్ని, ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలనను, ఆర్టికల్ 21 జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయని గుర్తుచేశారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించకుండా అధికారులు రద్దు చేయడం తీవ్ర విచారకరమని, ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని, సమస్యలకు పరిష్కారం చూపకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తునికి సమ్మయ్య, సామాజిక ఉద్యమ నేత వేల్పుల ప్రభాకర్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Also read: ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

Tags

Related News

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!

అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో బియ్యం కొరత.. ధరలు పెంచిన వారిపై 11 కేసులు నమోదు!

Big Stories

Advertisement
×