E-Paper
Advertisement

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!
Advertisement

Gadwal School: గద్వాల పట్టణంలోని చింతలపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పాఠశాల తరగతి గదుల స్లాబ్ ఒరిగిపోయి, పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.

సీలింగ్ పెచ్చులు ఊడి..

పాఠశాలలో మొత్తం నాలుగు తరగతి గదులు ఉండగా, అందులో ఒక గది సీలింగ్ పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారడంతో దానికి తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం 80 నుంచి 90 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ పాఠశాలలో మిగిలిన గదులు కూడా సరిగ్గా లేకపోవడంతో అరకొర వసతుల మధ్యే పాఠాలు వినాల్సి వస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు బయటి డ్రైనేజీ నీరు పాఠశాల ప్రాంగణంలోకి చేరి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం..

Advertisement

పాఠశాల భవన పరిస్థితిపై అధికారులకు పలుమార్లు విన్నవించినా, జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో స్వయంగా ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారీ స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన తరగతి గదిలో పెచ్చులూడుతుందోనని భయం భయంగా పిల్లలను బడికి పంపుతున్నామని వారు తెలిపారు. రోజూ ప్రమాదపు అంచుల మీద సాగుతున్న ఈ బడికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యనందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: తెలంగాణలో బియ్యం కొరత.. ధరలు పెంచిన వారిపై 11 కేసులు నమోదు!

Tags

Related News

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కూల్చివేసిత!

క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్.. గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు

కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

Big Stories

Advertisement
×