E-Paper
Advertisement

అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్

అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి సభలు, ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చౌకబారు ప్రసంగాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు.

విభజన హామీలు, నిధులపై ప్రశ్నాస్త్రాలు

Advertisement

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి విభజన హామీల పరిస్థితి ఏమిటో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్ల విషయంలో తెలంగాణపై నిరంతరం రాజకీయ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తల తోక లేని ఆరోపణలు చేస్తే బీజేపీ ఆటలు ఇక్కడ సాగవని హెచ్చరించారు.

ఓటు హక్కు, ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు

Advertisement

ఓటర్ల జాబితా సవరణ పేరిట అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడంపై కాంగ్రెస్ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ఓటు చోరీపై ప్రశ్నిస్తే విమర్శలు చేయడం కాదు, కేంద్ర ఎన్నికల వ్యవస్థ ద్వారా పారదర్శకత చూపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అందించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ , బీజేపీ లోపాయికారీ బంధం

గత పదేళ్ల బీఆర్‌ఎస్ దుర్మార్గపు పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ఆరాటపడుతోందని విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ రాజకీయ బంధాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే.. బీజేపీ మాత్రం విమర్శలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. అమిత్ షా తన సభలో కాంగ్రెస్‌పై బురద చల్లే ముందు తెలంగాణకు కేంద్రం చేసిన మేలుపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ తరఫున డిమాండ్ చేశారు.

Also Read: పిల్లి చేసే ఆ శబ్దం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?

Tags

Related News

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!

తెలంగాణలో బియ్యం కొరత.. ధరలు పెంచిన వారిపై 11 కేసులు నమోదు!

Big Stories

Advertisement
×