E-Paper
Advertisement

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!
Advertisement

Sri Devi Chowdary: సినీనటిగా ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నెక్కంటి శ్రీదేవి చౌదరి(Sridevi Chowdary) ఇటీవల తేజ సజ్జ(Teja Sajja) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది ట్రైటర్స్(The Traitors) షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే . ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి శ్రీదేవి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈమె పట్ల కొంతమంది ఉదేశపూర్వకంగానే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మానసికంగా కృంగదీసాయి..

ఇలా సోషల్ మీడియాలో తన గురించి అభ్యంతరకరమైన పోస్టులు చేస్తున్న వారిలో తన తోటి కంటెస్టెంట్ ధనుంజయ(dhananjay) పై ఈమె ఆరోపణలు చేయటమే కాకుండా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. ధనుంజయతో పాటు ఆయన అనుచరులు సోషల్ మీడియా ఖాతాలైన ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో అసభ్యకర పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో శ్రీదేవి పేర్కొన్నారు. ఈ విధమైనటువంటి ట్రోలింగ్ మానసికంగా చాలా కృంగ దీసిందని తెలిపారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

Advertisement

తన గురించి ధనుంజయ ఆయన అనుచరులు Dhanu -Dinu అనే ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభ్యంతరకరమైన పోస్టులు అలాగే మీమ్స్ ప్రచారం చేస్తున్నట్లు ఈమె పేర్కొన్నారు. ఇలా ఈమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి తన సహనటుడి పై కేసు నమోదు చేయడంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు ఈమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారు.BNS సెక్షన్ 79 తో పాటు ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 67 కింద ఎన్ వి  రమణ కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ డి. అశోక్ కు ఈ కేసును బదిలీ చేశారు. ఇలా ఈ కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

20 మంది కంటెస్టెంట్లతో ది ట్రైటర్స్..

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ తరహా వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి చౌదరి మాత్రం తనపై వస్తున్నటువంటి ఈ ట్రోల్లింగ్ పట్ల తీవ్రంగా స్పందిస్తూ కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారంపై ధనుంజయ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ కేసు వ్యవహారంలో నిజా నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ  రియాలిటీ షో విషయానికి వస్తే ఇందులో ఏకంగా 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.

Advertisement

Also Read: టాలీవుడ్ నిర్మాతానా.. కోలీవుడ్ ప్రమోటరా? తమిళ సినిమాలపై ఆ నిర్మాతకు అంత మోజు ఏంటో!

Related News

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

తండ్రి నమ్మకం… కూతురి పట్టుదల… ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా

సొంత సైన్యంలోనే కోవర్ట్… రెండవ ప్రపంచ యుద్ధం వెనుకున్న మిస్టరీ… యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన వార్ థ్రిల్లర్

తెలియని నంబర్ నుంచి ఆ ఫోన్ కాల్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో అలరించే తమిళ్ క్రైమ్ కామెడీ

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×