BigTV English

Hyderabad drugs bust : డ్రగ్స్ కలకలం.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో స్వాధీనం..

Hyderabad drugs bust : డ్రగ్స్ కలకలం.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో స్వాధీనం..

Hyderabad drugs bust : రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా పార్టీ కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారని ఆరా తీస్తున్నట్టు తెలిపారు.


వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను బాలానగర్‌, రాజేంద్ర నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు.

ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్‌ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవ్వరూ ఉన్నారు?. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. అయితే డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అర్జున్‌ తీసుకువచ్చినట్టు గుర్తించారు.


న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×