E-Paper
Advertisement

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మత్తు వదిలిన యంత్రాంగం.. రాత్రికి రాత్రే మెట్రో పిల్లర్ గుంతల పూడ్చివేత!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మత్తు వదిలిన యంత్రాంగం.. రాత్రికి రాత్రే మెట్రో పిల్లర్ గుంతల పూడ్చివేత!
Advertisement

Metro Pillar Safety Alert: మెట్రో పిల్లర్ల చుట్టూ గోతులపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రమాదకర గుంతలపై ఇన్నాళ్లు కళ్లుమూసుకున్న యంత్రాగం.. బిగ్ టీవీ కథనాలతో మత్తు నిద్ర వదిలింది. ప్రజల దృష్టి సైతం ఈ గోతులపైకి మళ్లడంతో రాత్రికి రాత్రే వీటిని పూడ్చే ప్రయత్నం చేశారు. రాత్రివేళ జేసీబీని తీసుకొచ్చి మెట్రోల పిల్లర్ కు ఆనుకొని ఉన్న గుంతలను మట్టితో నింపారు.

హైదరాబాద్ మెట్రో పార్కింగ్ రూ.1000 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన అనంతరం.. బిగ్ టీవీ మెట్రోపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ కు ఆనుకొని ఉన్న పిల్లర్ల వద్ద 10 అడుగుల లోతువరకు గుంతలు తవ్వి ఉండటాన్ని బిగ్ టీవీ రిపోర్టర్లు గుర్తించారు. ఈ అక్రమ తవ్వకాలపై గ్రౌండ్ లెవల్లోకి వెళ్లి మరి సమస్యను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు.. పిల్లర్ నెం.1193 వద్ద ఉన్న భారీ గుంతను రాత్రికి రాత్రి పూడ్చేశారు. ఉదయం అక్కడికి వెళ్లిన రిపోర్టర్ సాగర్ ఈ విషయాన్ని గుర్తించారు.

Advertisement

Also Read: రోజుకు రూ.50 పొదుపుతో.. ఏకంగా రూ.14 లక్షల ఆదాయం.. ఏం చేయకుండానే సంపాదించొచ్చు!

అయితే గురువారం అదే పిల్లర్ (నెం.1193) వద్ద బిగ్ టీవీ ప్రతినిధి సాగర్ రిపోర్టింగ్ చేశారు. పిల్లర్ కు ఆనుకొని భారీ గుంత తవ్వగా.. పిల్లర్ కు ఏర్పడ్డ పగుళ్లను సైతం ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. 1192, 1193 పిల్లర్ల మధ్య ఏకంగా 7, 8 అడుగుల లోతు గుంతలు తీసిన విషయాన్ని కళ్లకు కట్టారు. అయితే శుక్రవారం అక్కడి వెళ్లి చూడగా పరిస్థితి మారిపోయింది. ఆ పగళ్లు కనిపించకుండా పిల్లర్ పక్కన 8 అడుగుల మేర పెద్ద మట్టికుప్పను పోశారు. గురువారం వరకు ఉన్న గుంతలను శుక్రవారం నాటికి కప్పి పెట్టే ప్రయత్నం చేశారు.

Advertisement

గోతులు కప్పిపెట్టే ప్రయత్నంలో కూడా.. రమణారెడ్డి చేసిన తప్పు పూర్తిగా బట్టబయలు అయింది. మెట్రో పిల్లర్ల చుట్టూ గోతులు తీయడమే కాదు.. పిల్లర్లకు సపోర్ట్‌గా ఉండే బేస్‌ను కూడా దుర్మార్గంగా పగలగొట్టారు. ముక్కలైపోయిన ఆ పీసీసీ బెడ్‌నే గుంతల్ని కప్పిపెట్టడానికి వాడారు. దాదాపు 5-6 అంగుళాల మందం కలిగిన బలమైన బేస్ ను ఎవరి అనుమతి తీసుకొని పగలగొట్టారు? ఇది అధికారులకు తెలిసే జరిగిందా? ఇంత మందం కలిగిన బేస్ పగిలిన తర్వాత మెట్రో పిల్లర్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పార్కింగ్‌ స్థలాల, ఓపెన్ ల్యాండ్స్‌ను చీప్‌ రేట్‌కే లీజుకు కొట్టేసిన రమణారెడ్డి… తన ధనదాహంతో మెట్రో ప్రయాణికుల ప్రాణాల్ని కూడా పణంగా పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రజల భద్రతని గాలికి వదిలేస్తూ.. మెట్రో వ్యవస్థనే ధ్వంసం చేసే దుర్మార్గానికి తెరతీసినట్లు అర్థమవుతోంది. ఇన్నాళ్లూ మొద్దునిద్రపోయిన అధికారులు… అక్రమాల్ని బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చాక కళ్లు తెరిచారు. అయితే ఈ మొత్తం అక్రమాల్లో కీలక ప్రశ్నలు అలాగే ఉన్నాయి. తప్పు చేయకపోతే పిల్లర్ చుట్టూ మట్టి ఎందుకు కప్పేశారు? సీన్‌లోకి అసలు వ్యక్తి ఎందుకు రావట్లేదు? నెలనెలా మానిటరింగ్ చేయాల్సిన మెట్రో అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకి మాత్రం ఇంకా సమాధానాలు రావడం లేదు.

Also Read: శాస్త్రవేత్తల సంచలనం.. చేపల పొలుసులతో సరికొత్త ప్లాస్టిక్.. మట్టిలో వేస్తే 8 వారాల్లోనే మాయం!

 

Tags

Related News

ఒక్క చుక్క నీటిని వదులుకోం! కృష్ణా జలాలు, కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు

కూల్చేస్తాం.. హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వాహకులకు హైడ్రా వార్నింగ్

సిద్దిపేటకు రండి.. కడుపునిండా అన్నం పెట్టి నా భూములు చూపిస్తా: హరీశ్ రావు ఆఫర్!

ఆధారాలున్నాయన్నారుగా.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయరేం?: బండి సంజయ్ ఫైర్

కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం మీకే!

పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న

Big Stories

Advertisement
×