E-Paper
Advertisement

గ్లింప్స్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచేసిన ‘వెట్టువం’.. ఇదేం కాన్సెప్ట్ రా బాబు!

గ్లింప్స్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచేసిన ‘వెట్టువం’.. ఇదేం కాన్సెప్ట్ రా బాబు!
Advertisement

Vettuvam Glimpse:సామాజిక అంశాలే తన సినిమా కథలుగా తెరకెక్కిస్తూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న దర్శకులలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పా.రంజిత్.ఈయన తీసిన ‘అట్టకత్తి’, ‘మద్రాస్’, ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట పరంబరై’, ‘నక్షత్రం నగర్గిరదు’, ‘తంగలాన్’ వంటి సినిమాలు చూస్తేనే అర్థం అవుతుంది ఇక ఇదే కోవలో మరోసారి ‘వెట్టువం’ అంటూ సరికొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు రెడీ అయిపోయాడు.

‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ గ్లింప్స్‌

Advertisement

ఆర్య, వి.ఆర్. దినేష్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా మేకర్స్ విడుదల చేసిన ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ గ్లింప్స్‌తో ఈ సినిమా ఏలాంటి జానర్ లో తెరకెక్కిస్తున్నారో ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు మూవీ లవర్స్.ఇక పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

కథ విషయానికి వస్తే

Advertisement

‘వెట్టువం’ కథ విషయానికి వస్తే దీన్ని ఒక్క కాలంలో చెప్పడం లేదని, గతం, వర్తమానం, భవిష్యత్తు.. ఇలా మూడు వేర్వేరు కాలాలను కలుపుతూ కథను నడిపిస్తున్నట్టు గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతుంది.గతంలో ప్రజలు ఎలా జీవించేవారో, వారి జీవన విధానాలు, ఆచారాలు, పోరాట పద్ధతులు తర్వాతి తరాలపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఆ ప్రభావం భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చుట్టూ సినిమా తిరగబోతుందని ఇన్ సైడ్ టాక్.

అంటే ఇది కేవలం ఒక కాలానికి చెందిన యాక్షన్ సినిమా కాదన్నమాట. ఒక తరం నుంచి మరో తరానికి మారే శక్తి, ఆధిపత్యం, మనుగడ, నాయకత్వం వంటి అంశాలను మూడు కాలాల నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఈ ప్రపంచాన్ని ఎవరు పాలించాలి?’ అనే ప్రశ్న కథలో కీలకపాత్ర వహించబోతుందని గ్లిప్మ్స్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇంతే కాకుండా సినిమాలో సంప్రదాయ యుద్ధ కళలు వాటికి సంబంధించిన పోరాట పద్ధతులకు కూడా పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ‘ఇంద్ర విజా’ సందర్భంగా జరిగే ఓ ప్రత్యేక పోటీ కథలో ఆసక్తికరమైన మలుపులకి కారణం కానుందట. ఈ పోటీలో విజయం సాధించిన వారే అక్కడి వారికి నాయకుడు అవుతారని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

పూర్తిగా కొత్త ప్రపంచంలోకి

ఆర్య విషయానికి వస్తే.. పా. రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్పట్ట పరంబరై’ ఇప్పటికే యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే.ఇప్పుడు ‘వెట్టువం’లో మాత్రం పూర్తిగా కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆర్య పోషించిన పాత్రలతో పోలిస్తే ఇందులో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచినట్టు తెలుస్తుంది.ఇక ఇందులో శోభితా ధూళిపాళ్ల కూడా కీలక పాత్రలో తళుక్కుమనబోతుంది.

ఇక ఈ సినిమా కోసం నటీనటులు స్పెషల్ గా యాక్షన్ లో శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. గ్లింప్స్‌లో సీన్స్ చూస్తుంటే రెగ్యులర్ గా చేసే ఫైట్ లు కాకుండా సంప్రదాయ యుద్ధ కళలకు దగ్గరగా యాక్షన్‌ను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ‘వెట్టువం’లో యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో భాగంగానే ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

ఎలాంటి హిట్ ని రాబడతాడో !

మరోవైపు ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అఫీషియల్ గా ఎలాంటి డేట్ ని ఇప్పటివరకి మేకర్స్ అనౌన్స్ చేయలేదు.మొత్తానికి ఇప్పటివరకు ‘వెట్టువం’ గురించి ఉన్న ప్రశ్నలకు ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ గ్లింప్స్ కొన్ని ఆన్సర్స్ ఇచ్చిందనే చెప్పాలి.చూడాలి మరి తంగలాన్ తో పర్లేదనిపించుకున్న పా.రంజిత్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ని రాబడతాడో !

Tags

Related News

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?

కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?

Big Stories

Advertisement
×