E-Paper
Advertisement

సిద్దిపేటకు రండి.. కడుపునిండా అన్నం పెట్టి నా భూములు చూపిస్తా: హరీశ్ రావు ఆఫర్!

సిద్దిపేటకు రండి.. కడుపునిండా అన్నం పెట్టి నా భూములు చూపిస్తా: హరీశ్ రావు ఆఫర్!
Advertisement

Harish Rao: సిద్దిపేట రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. కాంగ్రెస్ నాయకులు తన ఆస్తులను, భూములను పరిశీలించేందుకు సిద్దిపేటకు వస్తున్నారనే ప్రచారాలపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తానీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. భారీ పోలీస్ బందోబస్తు, డ్రోన్ల నిఘా నడుమ పర్యటనలు చేయడంపై ఆయన సెటైర్లు వేశారు.

భారీ భద్రతలు, డ్రోన్లు ఎందుకు?

Advertisement

కాంగ్రెస్ నాయకుల పర్యటన తీరుపై హరీశ్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందలాది మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, రోప్ పార్టీల నడుమ రావడం, రహస్యంగా డ్రోన్లు పెట్టి ఫోటోలు తీయడం ఎందుకని ప్రశ్నించారు. ‘నేను ఇక్కడే ఉన్నాను, నాకు ముందుగా సమాచారం ఇస్తే అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. మంచిగా కడుపునిండా అన్నం పెట్టి, దగ్గరుండి నా తోటలు, భూములన్నీ చూపిస్తాను’ అని వ్యాఖ్యానించారు.

అఫిడవిట్‌లో అన్నీ స్పష్టంగా ఉన్నాయి

Advertisement

తన ఆస్తుల వివరాలు దాచాల్సిన అవసరం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. నా జీవితం తెరిచిన పుస్తకమని, ప్రతీ ఎన్నికల అఫిడవిట్‌లో సర్వే నంబర్లతో సహా భూములు, ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొన్నానని గుర్తుచేశారు. రామంచలో తనకు కేవలం 13 ఎకరాలు ఉంటే, కాంగ్రెస్ నాయకులు లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీలాగా తాను భూకబ్జాలు చేయలేదని, ప్రజల సొమ్ము దోచుకోలేదని ఘాటుగా విమర్శించారు.

సిద్దిపేట అంటేనే ఆతిథ్యానికి చిరునామా

సిద్దిపేట ప్రజలు తన పనితీరును చూసి వరుసగా ఏడుసార్లు గెలిపించి ఆశీర్వదించారని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రాంతం ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యానికి పేరుగాంచిందని చెప్పారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ప్రేమగా పలకరించి అన్నం పెడతామని, అంతగా భయపడుతూ భారీ పోలీసుల రక్షణలో రావాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకు లేదని హితవు పలికారు. రాజకీయం కోసం అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆధారాలున్నాయన్నారుగా.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయరేం?: బండి సంజయ్ ఫైర్

Tags

Related News

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మత్తు వదిలిన యంత్రాంగం.. రాత్రికి రాత్రే మెట్రో పిల్లర్ గుంతల పూడ్చివేత!

కూల్చేస్తాం.. హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వాహకులకు హైడ్రా వార్నింగ్

ఆధారాలున్నాయన్నారుగా.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయరేం?: బండి సంజయ్ ఫైర్

కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం మీకే!

పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న

భారీ కొండచిలువతో ప్రజలు బెంబేలు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, వీడియో వైరల్

Big Stories

Advertisement
×