E-Paper
Advertisement

CM RevanthReddy: సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్

CM RevanthReddy: సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
Advertisement

CM Revanth Reddy latest news(Political news in telangana): తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సౌత్‌కొరియాలో పర్యటిస్తు న్నారు. ఆ దేశంలోని పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ కారు టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా కంపెనీలు ముందుకొస్తున్నాయి. సోమవారం అమెరికా నుంచి సౌత్ కొరియాకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు హ్యుందాయ్ కార్ల కంపెనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక టెస్టింగ్ సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో బిజినెస్ చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తుల తోపాటు సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.

ALSO READ: వణికిస్తున్న వర్షాలు, తెలంగాణలో కురిసే ఛాన్స్

Advertisement

ఇందులోభాగంగా పలు కొరియన్ కంపెనీలు వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కొరియాకు చెందిన 25 టెక్స్ టైల్ కంపెనీల అధిపతులతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అని వివరించారు. చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. వీలు చూసుకుని అక్కడి నుంచి వివిధ కంపెనీల ప్రతినిధుల బృందం తెలంగాణలో పర్యటించనుంది.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×