Telangana rainfall update(TS today news): దేశ రాజధాని ఢిల్లీతో సహా.. ఉత్తర భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర భారత్‌లోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ వర్షాలు బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు తెలుపుతుంది వాతావరణ శాఖ.
ఇక రానున్న 24 గంటల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించి రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అంతేకాకుండా ఆయా సంబంధిత అధికారులను అలర్ట్ చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
Also Read: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…
ఈ క్రమంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్సుందని, ఉరుములు మెరుపులతో కూడిన గాలులు బలంగా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ని జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షం కురిసే సమయానికి అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవ్వరు కూడా ఇల్లు దాటి వెళ్లకూడదని హెచ్చరించింది.
ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుండి వాతావారణం హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో.. మంగళవారం ఉదయం నుండి జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొ్ంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి మళ్లీ జల్లులు కురిసే ఛాన్సుందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.