E-Paper
Advertisement

Telangana Weather News : మండుటెండల నుంచి ఉపశమనం.. తెలంగాణకు 4 రోజులు వర్షసూచన

Telangana Weather News : మండుటెండల నుంచి ఉపశమనం.. తెలంగాణకు 4 రోజులు వర్షసూచన
Advertisement

Telangana Weather Update Today : ఉదయం 9 గంటలైతే చాలు.. రోడ్డుమీదికి రావాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. కానీ.. ఉద్యోగాలు, రోజువారి పనులు చేసుకునేవారికి బయటకు రావడం తప్పట్లేదు. పొట్టకూటి కోసం వెళ్లాలి కాబట్టి.. మండుటెండలో మాడిపోతూనే పనులు చేసుకుంటున్నారు. మండుటెండలకు తోడు తీవ్రమైన ఉక్కపోత ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది.

Advertisement

తెలంగాణలో నాలుగైదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మార్చి 17 నుంచి 20 వరకూ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ అంచనా ప్రకారం ఈ నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లోనూ వాతావరణం కాస్త చల్లగా ఉంది. ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు.. చల్లబడిన వాతావరణంతో సేదతీరుతున్నారు.

Also Read : మండుతున్న ఎండలు.. వేడిని ఇలా నివారించండి!

Advertisement

రాబోయే 72 గంటల్లో.. అంటే మార్చి 16 నుంచి 18 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కొన్నిప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఐఎండీ అంచనా ప్రకారం.. తూర్పు, మధ్య భారతదేశంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎండల తీవ్రత మున్ముందు పెరగనున్న నేపథ్యంలో రబీ పంటలు దెబ్బతినే అవకాశాలున్నట్లు తెలిపింది. కాగా.. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 40.9 డిగ్రీలు, హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పాటిగడ్డలో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Tags

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×