E-Paper
Advertisement

Khammam : ఖమ్మం ప్రమాదంపై భిన్నకోణాల్లో దర్యాప్తు.. బాధిత కుటుంబాలు ఆందోళన..

Khammam : ఖమ్మం ప్రమాదంపై భిన్నకోణాల్లో దర్యాప్తు.. బాధిత కుటుంబాలు ఆందోళన..
Advertisement

Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అజ్మీర మంగు, బానోతు రమేష్ లు బుధవారం మధ్యాహ్నం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం మరో నలుగురిని ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో లక్ష్మణ్ ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి అతని ప్రాణాలు నిలిపి హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు కాగా….ముగ్గురు చనిపోయారు. నలుగురికి కాళ్లను తొలగించారు.
అయితే వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం వల్ల కాళ్లు నుంచి గుండెకు పంపింగ్ చేసే నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు.

Advertisement

రాత్రి పొద్దు పోయేంత వరకు మృతదేహాలను గ్రామంలోకి అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుపడ్డారు.
మృతుల కుటుంబసభ్యులకు వెంటనే ప్రభుత్వ సాయం అందించి బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు…. పక్కా ఇల్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మరోవైపు ఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది. ఇది సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదంటే….. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×