E-Paper
Advertisement

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇందుకోసం నిన్న రాత్రి 10 గంటలకే హస్తిన రీచ్ అయ్యారు. ఇవాళ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం సమావేశానికి హాజరుకానున్నారు. రైజింగ్ ఇండియాలో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో యూఎస్-ఇండో సమిట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9. గంటలకు జరిగే సమావేశంలో యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. వారిని తెలంగాణకు రావాలని ఆహ్వానించనున్నారు.

ఇందులో తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్ చేయడంతో పాటు అమెరికా-ఇండియా వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. అలాగే రైజింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన అంశాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ ఆలోచనలను వారితో పంచుకోనున్నారు. హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం చేపడుతున్న గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, అమెరికన్ కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను వివరించనున్నారు.

Advertisement

ఆ తర్వాత ఏఐసీసీ అగ్ర నేతలను కలిసే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ పోలింగ్ పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. డీసీసీ సెలక్షన్‌పైనా సీఎం చర్చించనున్నారు. ఫైనల్ లిస్ట్ పరిశీలించిన తర్వాత తన అభిప్రాయాన్ని తెలిపే ఛాన్స్ ఉంది. దీంతో పాటు డిసెంబర్ 9న జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకూ ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్లను కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Also Read: ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు..

Advertisement

ఇదే టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ప్రధానంగా మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే చాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంపై నితిన్ గడ్కరీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయని సమాచారం. సో మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×