EPAPER

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

– పాలసీలు లేని పర్యటక రంగం
– విదేశీ టూర్లతో వేస్ట్ అవుతున్న ప్రజాధనం
– ప్రమోషన్ పేరుతో ఏటా పర్యటనలు
– పేరుకే అఫీషియల్.. అంతా వెకేషన్
– ప్రతి టూర్‌లోనూ ఫైనాన్స్ మేనేజర్
– గత 8 ఏళ్లుగా నో రిపోర్ట్స్
– ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ మనోహర్ రావు
– అదే బాటలో ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ రాజలింగం
– చెరువులో నిథిమ్ కట్టడం.. కూల్చివేతతో రూ.4 కోట్ల నష్టం
– కూల్చివేతలోనూ స్కామ్‌కు తెరలేపిన డైరెక్టర్స్
– ఇప్పటికే జహీరాబాద్ కాలేజీ మూసివేత.. రూ.12 కోట్ల నష్టం
– తెలంగాణ టూరిజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైనంపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పదేళ్లు తెలంగాణ టూరిజానికి పాలసీలు లేకుండా పని చేశారు గత పాలకులు. ఆ పాలసీలు రూపొందించాలని రెండు సార్లు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల దాకా థర్డ్ పార్టీలకు సమర్పించారు. 2016లో బుర్రా వెంకటేష్ సెక్రెటరీగా పనిచేసినప్పడు రూ.7.5 లక్షల బడ్జెట్ ఇచ్చారు. 2022లో అప్పటి ఎండీ మనోహర్ రావు డొల్ల కంపెనీకి రూ.10 లక్షలు ఇచ్చారు. కానీ, ఆ రిపోర్టులు ఎక్కడ ఉన్నాయో, ఏం చెప్పారో, ఎవరికీ తెలియదు. కానీ, 2015 నుంచి ఏటా మూడుసార్లు టూరిజం ప్రమోషన్ అంటూ వివిధ దేశాలు తిరిగి వచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. విచిత్రం ఎంటంటే, ఆయా దేశాల నుంచి ఒక్క టూరిస్ట్ తెలంగాణకు రాకపోయినా, వీళ్లు మాత్రం ప్రమోషన్ పేరుతో విహార యాత్రలు ఇప్పటికీ చుట్టేసి వస్తున్నారు. వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి సమర్పించడం లేదు. ఇప్పటి వరకు జర్మనీ, లండన్, యూఎస్‌ఏ, కెనాడా, ఫ్రాన్స్, ఫాట్( జర్మనీ), జూరిక్ (స్విట్జర్లాండ్), వియన్నా(ఆస్ట్రియా), రోమ్, విలాన్ (ఇటలీ), మాడ్రిడ్(స్పెయిన్), బెర్లిన్(జర్మనీ), సియోల్ (సౌత్ కోరియా), మాస్కో(రష్యా), ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా లాంటి ప్రదేశాల్లో విదేశీ పర్యటకులను ఆకర్షిస్తామనే నెపంతో కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆయా దేశాల నుంచి ఎంతమంది టూరిస్టులు వచ్చారని అడిగితే మాత్రం ఇప్పటికీ టూరిజం వద్ద లెక్కలు లేవు. విదేశీ పర్యటనలకు మంత్రుల స్థాయి నుంచి సెక్రెటరీలు, అసిస్టెంట్ డైరెక్టర్స్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, టూరిస్ట్ గైడ్స్, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ వెళ్లొచ్చారు. నిజానికి, వీరంతా వెళ్లకుండానే తెలంగాణ స్టాల్స్ అక్కడ నిర్వహించే టెక్నాలజీ ఉంటుంది. కానీ, ఏటా రూ.3 నుంచి రూ.5 కోట్లు ఖర్చు పెట్టి వెళ్లొస్తున్నారు. ఇందులో ఫైనాన్స్ మేనేజర్ శాంతి సమాధానం వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఈమె గత 8 ఏండ్లుగా కార్పొరేషన్ ఫైనాన్స్ రిపోర్ట్ నివేదికను సమర్పించడం లేదు. తెలియకుండానే అడ్వాన్స్ ట్యాక్స్ పేరుతో రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చేలా పెనాల్టీలు చెల్లించేలా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.


Also Read: హైదరాబాద్‌లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ దారుల గుండా వెళ్తే మీకు చుక్కలే!

లాభాలు తక్కువ.. నష్టాలే ఎక్కువ

టూరిజం, హెల్త్ టూరిజంతో తెలంగాణకు మంచి పేరుంది కానీ, విదేశీయులను ఆకట్టుకునేందుకు ప్లానింగ్ లేకపోవడంతో డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతోంది. అడ్వాన్స్ ట్యాక్స్ పెనాల్టీ రూ.2 కోట్లు, 8 ఏండ్లలో విదేశీ టూర్స్ రూ.25 కోట్లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాల్టీ మేనేజ్మెంట్‌తో ఏటా రూ.3 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇక్కడ ప్రతి బ్యాచ్‌కి 120 మంది స్టూడెంట్స్‌కి 10 మంది కూడా రాని పరిస్థితి దాపురించింది. శేరి చిన్నం రెడ్డి డైరెక్టర్‌గా ఉంటూ నిథిమ్‌ని నిండా ముంచేశాడు. ఇతనికి అదనంగా చెల్లించిన డబ్బులు రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా కూల్చివేసిన బిల్డింగ్‌తో రూ.4 కోట్ల నష్టం వచ్చింది. దీన్ని పూర్తిగా రామమ్మ కుంటలోనే నిర్మించారు. పూర్తి చేయకుండానే హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నారు. అయితే, ఎలాంటి టెండర్స్, లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు. అందులో ఉండే ఇనుప సీకులను తీసుకుని కూల్చివేశారు. రూ.20 లక్షల ఐరన్ తీసుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. మూడు రోజుల నుంచి భవంతిని మొత్తం ఐరన్ సీకుల కోసమే కూల్చివేతలు కొనసాగించారు. అంతేకాదు, రూ.14 లక్షల కారుకు 30 లక్షల పెట్రోల్ మెయింటెనెన్స్ పెట్టిన ఘనులు నిథిమ్‌లో ఉన్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోండి టూరిజం శాఖ నిర్వహణ ఎలా ఉందో.

అద్దెలు రాబట్టడంలో కమీషన్స్ దందా

గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 91లో రూ.150 కోట్ల భూమిని సప్తరిషి హోటల్స్‌కి లీజుకు ఇచ్చారు. వీరు తనఖా పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాకుంలో రుణం తీసుకున్నారు. అది చెల్లించకపోవడంతో బ్యాంకు స్వాధీనం చేసుకుంది. దీనిపైన హైకోర్టులో పిటిషన్స్ దాఖలు అయ్యాయి. రెండేళ్ల క్రితమే ఐమాక్స్, జలవిహార్, దస్పల్లా హోటల్, స్నో వరల్డ్, ఎక్స్ పోర్టల్ హోటల్, యాత్రి నివాస్ బేగంపేట్, సికింద్రాబాద్ గోల్ఫ్ క్లబ్(శామీర్ పేట్)కు సంబంధించి రూ.250 కోట్ల అద్దె బకాయిలు గుర్తించారు. వీటిని ఇప్పటికీ వసూలు చేసింది లేదు. కమీషన్స్ తీసుకుని టూరిజం డిపార్ట్‌మెంట్‌కి తీరని నష్టం జరుగుతోంది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు వరద నిధులు విడుదల చేసిన కేంద్రం… తెలంగాణకు అన్యాయం?

ట్రాన్స్‌పోర్టులోనూ అదే దందా!

ఎప్పుడైనా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు టూరిస్టులను తీసుకొస్తే ఆదాయం పెరుగుతుంది. కానీ, తెలంగాణ టూరిజం మాత్రం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులను నడుపుతోంది. అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే, జిల్లాల నుంచి హైదరాబాద్‌కి బస్సులను అందుబాటులో ఉంచి ప్రొత్సహించాలి. నిజాం కాలం నాటి గుర్తులను, అద్భుతమైన కట్టడాలను చూపించాలి. టూర్స్ ప్యాకేజీ ఉండాలి. కానీ, అలాంటిదేం లేకుండా షిర్డీకి, తిరుపతికి, అరుణాచలానికి బస్సులు నడుపుతోంది. ఇందులో 35 నుంచి 40 సీట్లు ఉంటే 25 నుంచి 30 సీట్లు నిండినట్లు రాసుకుంటారు. ప్రతి బస్సుకు 10 మంది ప్రయాణికుల సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. డీజిల్ బంకుల్లో పోసే ముందు స్కామ్ జరుగుతోంది. ఒకప్పుడు డ్రైవర్‌గా జాయిన్ అయిన రాజలింగం, మాజీ ఎండీ మనోహార్ అండ దండలతో, అక్రమాలతో ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అప్పటి నుంచి ఈ అక్రమ దందా నడుస్తూనే ఉంది.

పాలసీలు ఎప్పుడు.. ఇంకెన్నాళ్లీ టూర్లు?

కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా టూరిజం ప్రమోషన్ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమెరికాకు ప్లాన్ వేస్తున్నారు. అయితే, పాలసీని ప్రవేశపెట్టకుండా, ఆమోదం తెలుపకుండా, దిశానిర్దేశం లేని పర్యటనలతో కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఇలాంటి టూర్స్‌తో ప్రజల సొమ్మును విచ్చలవిడిగా వాడడం ఎంతవరకు కరెక్ట్. వెంటనే పాలసీ ప్రకటించి, ఎవరు వెళితే పర్యాటకులు రాష్ట్రానికి వస్తారో వారిని మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంది. రామప్ప లాంటి హెరిటెజ్ నిర్మాణాలు తెలంగాణలో కో కొల్లలు. కానీ, మన తెలంగాణ ప్రజలకే అవగాహన కల్పించలేని పరిస్థితిలో టూరిజం శాఖ ఉందనే విమర్శలు ఉన్నాయి.

Related News

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

Big Stories

×