
BJP party news in telugu(Political news in telangana): బీజేపీ అధిష్ఠానం ఈటలకు పెద్ద పీట వేసినట్టా? పక్కన పెట్టినట్టా? లేదంటే, రేవంత్‌రెడ్డి అన్నట్టు మళ్లీ మోసం చేసిందా? ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల నిర్వహణ కమిటీ పదవి పెద్దదా.. ప్రచార కమిటీ పెద్దదా? అనే చర్చ నడుస్తోంది.
ఈటలకు బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జగిగింది. కొద్దిరోజుల క్రితం గౌహతి వెళ్లి అసోం సీఎంతో భేటీ అయిన సందర్భంగా ఇది మరింత బయటకు వచ్చింది. ప్రచార కమిటీ ఛైర్మన్ పోస్ట్ తో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు? ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈటలకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదు? ఎన్నికల కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం వెనుక బిజెపి అధిష్ఠానం అంతర్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు వస్తున్నాయి.
ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వడం అంటే ఈటల సీఎం అభ్యర్థి కాదని హైకమాండ్ చెప్పకనే చెప్పిందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. బీజేపీలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటి ప్రకారం ఇప్పటి నియామకాలకు అన్వయించి చూస్తే కొన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. 2014 లోక్ సభ ఎన్నికల ముందు మోదీని ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీజేపీ బాధ్యతలు అప్పగించింది. అప్పుడే ఆయనను ప్రధాని అభ్యర్థి అని కూడా ప్రకటించారు. అలాగే అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మను కూడా ఎన్నికలకు ముందు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ప్రకటించారు. అలా ఒకటి రెండు రాష్ట్రాలలో మాత్రమే ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత వారే సీఎం అయ్యారు.
ఇప్పటికే టీబీజేపీలో గ్రూపులు పెరగడం, అసంతృప్తులు పెరగడంతో ఈటలకు ఇచ్చే పదవి విషయంలో హైకమాండ్ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. కొత్తగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించడంతో సీఎం అభ్యర్థి కాదన్న విషయాన్ని మిగతా నాయకులకు, శ్రేణులకు చేరవేసిందా? అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ను ఎన్నికల సమయంలో నియమిస్తారు. ఎందుకంటే సభలు సమావేశాలు ఎన్నికల ప్రచార సామాగ్రి ఎలక్షన్ టైంలో వివిధ కమిటీలతో సమన్వయం కోసం బాధ్యతలు ఇస్తారు. సాధారణంగా రాష్ట్ర అధ్యక్షుడి పదవితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు మాత్రమే ప్రకటిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో ఉన్న ప్రస్తుత టాక్ ప్రకారం సీఎం అభ్యర్థిగా బీసీ కోటాలో డాక్టర్ లక్ష్మణ్ వైపు హైకమాండ్ చూస్తోందని అంటున్నారు. ఈటల సైతం బీసీ నేత అయినా.. ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం మైనస్.
ఇక, బీజేపీ లొల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎంటరయ్యారు. గతంలో చేరికల కమిటీ బాధ్యతలు ఇచ్చి.. ఫిరాయింపులను ప్రోత్సహించారని.. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ అప్పగించి పైసా వసూల్ చేసే, ఖర్చు చేసే పని కట్టబెట్టారని.. ఈటల రాజేందర్‌ను అధిష్టానం మళ్లీ మోసం చేసిందని అన్నారు. ఈటల ఇప్పటికైనా ఆలోచించుకొని.. సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ.. కాంగ్రెస్‌లో చేరాలని పరోక్షంగా పిలుపు ఇచ్చారు రేవంత్‌రెడ్డి.