
BJP News Telangana(TS politics): కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డి. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్‌రెడ్డి.. రెండు ప్రధాన అంశాలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తోందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని.. రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందని మండిపడ్డారు.
సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని.. కల్వకుంట్ల కుటంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసుల నిర్మాణానికి స్థలం ఉంటుంది కానీ.. పేదలకు ఇల్లు కట్టించేందుకు స్థలం ఉండదా అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కిషన్‌రెడ్డి.
కిషన్‌రెడ్డి నేతృత్వంలో అందరం కలిసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణలో గడీల పాలనను అంతమొందించడమే అందరి లక్ష్యమన్నారు బండి. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.
అధ్యక్ష పదవి మార్పు తర్వాత.. ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లకుండా.. జాయింట్‌గా మీడియా ముందుకు వచ్చి.. కేసీఆర్ సర్కారుపై.. జంటగా విమర్శలు చేశారు వారిద్దరు. ఇకముందు కూడా ఇలానే కలిసి పోరాడుతామనే మెసేజ్ ఇచ్చారు.