BigTV English

Congress: కాంగ్రెస్ ఖతమా? పార్టీని వీడేది వారేనా? మర్రి మంటలు..

Congress: కాంగ్రెస్ ఖతమా? పార్టీని వీడేది వారేనా? మర్రి మంటలు..

Congress: వెళ్తూ వెళ్తూ మర్రి శశిధర్ రెడ్డి పేల్చిన బాంబు కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోంది. త్వరలోనే తనలానే చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనలాంటి ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని.. టీఆర్ఎస్ ను ఎదుర్కోలేదని.. చెంచాగాళ్లు పార్టీని నడిపిస్తున్నారని.. అబ్బో చాలానే అన్నారు. అన్నీ హాట్ కామెంట్సే.


పార్టీని వీడేటప్పుడు అందరూ కామన్ గా చేసే కామెంట్లేనని.. మర్రి మాటలను లైట్ తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆయనలానే పార్టీని వీడే అవకాశం ఉన్న నేతలు ఇంకా ఉన్నారనేది వాస్తవమేనని అంటున్నారు. ఆ లిస్టులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఉత్తమ్, వీహెచ్, మధు యాస్కీ లాంటి అసంతృప్త నేతలు చాలామందే ఉన్నారు. వీరిలో పార్టీని వీడేంత సాహసం ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.

ఫస్ట్ వికెట్ వెంకట్ రెడ్డినే అనేది అందరి మాట. ఇప్పటికే ఆయన సోదరుడు పార్టీని వీడి, బీజేపీలో చేరి, మునుగోడులో ఓడిపోవడం.. వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అవడం.. రేవంత్ రెడ్డి అంటే అసలేమాత్రం పడకపోవడం.. ఇలా అన్ని కారణాలు ఆయన కాంగ్రెస్ ను వీడుతారనే చెబుతున్నాయి. మునుగోడు ఫలితంతో కాస్త డిఫెన్స్ లో పడ్డారని.. లేదంటే ఇప్పటికే కాషాయ కండువా కప్పుకునే వారని అంటున్నారు. తాను హోంగార్డు లాంటి వాడినంటూ వెంకట్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కారు. అయితే, సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టున్నారు. ఆయనే వెళ్తారా? పార్టీనే వెళ్లగొడుతుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.


హస్తానికి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్న మరో లీడర్ జగ్గారెడ్డినే అంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్ గా జూమ్ మీటింగ్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఫలితంపై నేరుగా సమీక్ష చేసే సమయం కూడా లేదా? అంటూ మండిపడ్డారు. పార్టీ నడిపే పద్దతి ఇది కాదంటూ ఫైర్ అయ్యారు.

జగ్గారెడ్డి గతంలోనే టీఆర్ఎస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. తాను సీఎం కేసీఆర్ ను విమర్శించనంటూ ఓపెన్ గానే చెప్పారు. ఓ కార్యక్రమంలో కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పటికీ ఒక్క హరీష్ రావు మినహా.. గులాబీ నేతలందరితో జగ్గారెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే, కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉన్న నేతల్లో జగ్గారెడ్డి పేరు తరుచూ వినిపిస్తూ ఉంటుంది.

ఇక, వెటరన్ లీడర్ వీహెచ్ కు రేవంత్ రెడ్డి అంటే అస్సలు గిట్టడం లేదు. సోషల్ మీడియాలో రేవంత్ సైన్యం తన ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసేలా విపరీతంగా ట్రోల్ చేస్తోందనేది ఆయన ఆగ్రహం. అదంతా రేవంతే చేయిస్తున్నారని ఆరోపిస్తుంటారు. ఈ వయసులో వీహెచ్ కాంగ్రెస్ ను వీడే ఛాన్స్ తక్కువే అయినా.. తప్పనిసరి అయితే హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

మరోవైపు, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లు సైతం పార్టీ తీరుపై, తమకు ఇస్తున్న ప్రాధాన్యంపై గుర్రుగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను వీడే పరిస్థితి లేదంటున్నారు. అయితే, నేతలకంటే కార్యకర్తలే కాంగ్రెస్ బలం. ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఆ పార్టీ సొంతం.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కానీ, అంతలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా బీజేపీని రెచ్చగొడుతూ.. హస్తం పార్టీకి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అసలైన వార్ అనేలా సీన్ క్రియేట్ చేయడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి ఒక్కరే వారి ఆశాకిరణం. అందుకే, ప్రస్తుతం పార్టీ నుంచి పెద్దగా వలసలు లేవు. మరికొందరు సీనియర్లు కాంగ్రెస్ ను వీడేవారైతే.. వారంతా మర్రి శశిధర్ రెడ్డి వెంటే గుంపుగా వెళ్లిపోయేవారు. మిగతా వాళ్లంతా వేచి చూసే ధోరణిలో ఉండటంతోనే మర్రి ఒక్కరే కాంగ్రెస్ కు బై బై చెప్పారని అంటున్నారు. అయితే, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు చిక్కకుండా ఉండటం అంత ఈజీ మాత్రం కాదు. రాజగోపాల్ రెడ్డి లానే నయానో, భయానో కాషాయ కండువా కప్పేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పూర్వవైభవం సాధ్యమేనా?

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×