E-Paper
Advertisement

Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?

Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?
Advertisement

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మీద పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో పెద్దఎత్తున కుంభకోణానికి పాల్పడిందని.. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గును తరలించడానికి వేసిన రవాణా టెండర్లలో భారీ స్కాం జరిగిందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డిదే కీ రోల్ అని ఆరోపించారు. తన బావమరిది కంపెనీకి లబ్ధి చేకూరేలే రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రధానంగా ఆరోపించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తం కూడా ఉందని అందుకే నైనీ టెండర్లు రద్దు చేసిన ఆయన..మిగతా టెండర్లు ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు. దీంతో హరీశ్ రావు ఆరోపణలపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘మెగా’ను తప్పించేందుకేనా?

నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని హరీశ్ రావు మొదటి నుంచి ఆరోపిస్తుండగా..రంగంలోకి దిగిన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీబీఐ విచారణ కోరగా.. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అసలు విషయానికొస్తే నైనీ బొగ్గు బ్లాక్స్‌లో సీఎం బావమరిది సుజన్ రెడ్డి వేసిన కాంట్రాక్టు చాలా చిన్నదని.. మెగా కృష్ణారెడ్డి వేసింది దానికి పది రేట్లు ఉంటుందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేఘా కృష్ణారెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. నాడు నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు.. మేఘా కృష్ణారెడ్డి ఒక్కటై ప్రజల సొమ్మును దండుకున్నారని పరోక్షంగా ఆరోపించారు.

Advertisement

కావాలనే నాడు ఎక్సెస్ శాతానికి టెండర్లకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని దాని వెనుక గుంటనక్క హరీశ్ రావు ఉన్నారని ఆమె ఆరోపించారు. ఇక మేఘా కృష్ణా రెడ్డిని ప్రస్తుతం తప్పించేందుకే సుజన్ రెడ్డిని ముందు పెట్టారన్నారు. గతంలో సుజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చినప్పుడు ఆయన సీఎం బావమరిది అని తెలియదా? అని కవిత ప్రశ్నించారు. కావాలనే దళిత నేతపై అబండాలు మోపారని కవిత వెల్లడించారు.దీని వెనుక తతంగం అంతా నడిపిస్తున్నది హరీశ్ రావే అని ఆరోపించారు. హరీశ్ రావు లేఖ రాస్తే 2014 నుంచి సింగరేణిలో వేసిన టెండర్లపై విచారణ జరిపిస్తామని భట్టి విక్రమార్క చెబితే ఎందుకు రాయడం లేదని ఆమె ప్రశ్నించారు.

Dhurandhar Actor Arrest: బుక్కైన దురంధర్ నటుడు.. పనిమనిషిపై అత్యాచారం, ఆపై అరెస్ట్

తెరవెనక రాజకీయం…

Advertisement

సింగరేణి టెండర్ల కోసం మెగా కృష్ణా రెడ్డి ప్రయత్నిస్తుండగా.. తక్కువ కోట్ చేసిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తే ఆ టెండర్లు రద్దు అయితే తమ వారికి టెండర్లు దక్కించుకోవచ్చనే ప్లాన్ హరీశ్ రావు వేశారని.. అందుకే దళితనేతపై తప్పుడు కథనాలు రాయించి బద్నాం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించినట్టు తెలుస్తున్నది. హరీశ్ రావు తెరవెనక రాజకీయం చేస్తున్నారని.. ఈ విషయం తెలియక బీఆర్ఎస్ నేతలు ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారని అన్నారు.కేటీఆర్ సైతం ఈ విషయం తెలియక గుంతలో పడ్డారని చెప్పారు. ఇదిలాఉండగా, మాజీ మంత్రి హరీశ్ రావు మీద కవిత చేసిన వ్యాఖ్యలపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం మద్దతుగా నిలుస్తున్నట్టు టాక్. అయితే, కవిత త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతుందని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×