BigTV English

Telangana: డీహెచ్ VRS?.. గులాబీ గూడెంకు గడల! మరి, వనమా?

Telangana: డీహెచ్ VRS?.. గులాబీ గూడెంకు గడల! మరి, వనమా?
dh

Telangana: పొలిటికల్ ఎంట్రీకి తహతహలాడుతున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. తన ఉద్యోగానికి VRS కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆమోదించాలని కోరగా.. ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇప్పటికే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అక్కడ తరచు పర్యటిస్తూ.. సామాజిక కార్యక్రమాలతో పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వేడి రాజేశారు.


కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ వైపు వెళ్లారాయన. డీహెచ్ గడల శ్రీనివాసరావు కూడా BRS నుంచే పోటీ చేస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. మరి, వనమా వెంకటేశ్వర్‌రావు పరిస్థితేంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే వనమా రిటైర్మెంట్ తీసుకోవాలంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. పొలిటికల్ కామెంట్స్ ఎలా చేస్తారనే రచ్చ జరిగింది.

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉంది. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన కాళ్లకు మొక్కినప్పుడే.. అతని పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరిగింది. తాను పోటీ చేయాలని భావిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలో తరచు పర్యటిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తనకంటూ ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని.. తన పేరు నానుతుండేలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. VRSకు కూడా అప్లై చేయడం కొత్తగూడెం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈనెల 30న శ్రీనివాసరావు బర్త్‌డే ఉంది. ఈలోగా VRS ఆమోదం.. రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×