E-Paper
Advertisement

Jaggareddy: నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయాలి మరీ: జగ్గారెడ్డి

Jaggareddy: నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయాలి మరీ: జగ్గారెడ్డి
Advertisement

Jaggareddy Comments(Political news today telangana): కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రాహుల్ గాంధీ వెంటే ఉన్నారని.. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని తెలిసి బీజేపీకి భయం పుడుతుందని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.. దీంతో ప్రధాని మోదీ, అమిత్ షా లో దడ మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు తాము వ్యతిరేకం కాదంటూ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మొదటిసారి చెప్పుకోవాల్సిన పరిస్థితిని రాహుల్ గాంధే తీసుకొచ్చారని ఆయన అన్నారు.

ప్రధాని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు.. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ అబద్ధాలు ఆడడం ఎంతవరకు కరెక్ట్? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తాళిబొట్టు తెంచి ముస్లింలకు ఇస్తారంటూ.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ చెప్పడం దారుణమని పేర్కొంటూ మోదీ వ్యాఖ్యలకు ఆధారం ఏమైనా ఉందా..? ఆ ఆధారం చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు ముక్కు నేలకు రాయాలి అంటూ జగ్గారెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

Advertisement

Also Read: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ మాటలకు విలువే లేదన్నారు. ఆయన యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నాడు గానీ.. ఏనాడైనా ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీలను సందర్శించాడా అంటూ ప్రశ్నించారు. ఆ వర్సిటీలను సందర్శించిన తరువాత కేసీఆర్ మాట్లాడాలి తప్ప అంతవరకు వర్సిటీల గురించి మాట్లాడొద్దని జగ్గారెడ్డి కేసీఆర్ కు హితవు పలికారు.

Tags

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×