E-Paper
Advertisement

Jagguswamy : హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని వినతి..

Jagguswamy : హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని వినతి..
Advertisement

Jagguswamy : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తనను అక్రమంగా ఇరికించారని హైకోర్టులో కేరళకు చెందిన జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ వేశారు. తనకు సిట్‌ జారీ చేసిన 41-ఏ సీఆర్‌పీసీ, లుకౌట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. జగ్గుస్వామికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించింది. తుషార్, రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ ప్రయత్నించారని అభియోగాలున్నాయి. ఈ కేసులో జగ్గుస్వామి ప్రమేయం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే జగ్గుస్వామికి సిట్ 41-ఏ సీఆర్ పీసీ నోటీసులు ఇచ్చింది. జగ్గుస్వామి విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో జగ్గుస్వామి ఈ రెండు నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×