E-Paper
Advertisement

Jangaon Municipality: జ‌న‌గామ‌లో హంగ్‌.. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు.. ఇండిపెండెంట్లే కింగ్ మేక‌ర్లు

Jangaon Municipality: జ‌న‌గామ‌లో హంగ్‌.. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు.. ఇండిపెండెంట్లే కింగ్ మేక‌ర్లు
Advertisement

Jangaon Municipality: జ‌న‌గామ, స్వేచ్ఛ‌ : జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో హైటెన్స‌న్ నెల‌కొంది. జ‌న‌గామ మ‌న్సిపాలిటిలో (Jangaon Municipality) 30 వార్డులకు బీ ఆర్ ఎస్ 13 వార్డుల‌ను, కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ ఎం ఒక వార్డును గెలుచుకుంది. దీంతో హంగ్ ఏర్ప‌డింది. అయితే అన్యూహంగా ఇండిపెండెంట్లు న‌లుగురు గెల‌వ‌డం జ‌న‌గామ లో తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతుంది. ఇద్ద‌రు బీ ఆర్ ఎస్ లో కీల‌క నేత‌లుగా ఉన్న‌ప్ప‌టికి వారికి టికెట్ల‌ను ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి నిరాక‌రించారు. దీంతో మ‌న‌స్థాపం చెందిన ఇద్ద‌రు బీ ఆర్ ఎస్ నేతలు ఇండిపెండెంట్లుగా బ‌రిలో నిలిచారు. 5వ‌వార్డు నుంచి మిద్దెపాక భాస్క‌ర్‌, 15వ వార్డు నుంచి మార‌బోయిన పాండులు బీ ఆర్ ఎస్ రెబెల్‌గా బ‌రిలో నిలిచి గెలిచారు. వారికి తోడు మ‌రో ఇద్ద‌రు ఇండిపెండెంట్లు గెలువ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మార‌బోయిన పాండు నేతృత్వంలో న‌లుగురు ఇండిపెండెంట్లు ఇప్పుడు ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఉన్నారు.

కింగ్ మేక‌ర్లుగా ఆ న‌లుగురు

5వ వార్డు కౌన్సిల‌ర్‌గా గెలిచిన మిద్దెపాక భాస్క‌ర్‌, 8వ వార్డు కౌన్సిల‌ర్ సందుప‌ట్ల మంజుల‌, 15వ వార్డు కౌన్సిల‌ర్ మార‌బోయిన పాండు, 23వ వార్డు కౌన్సిల‌ర్ భూష ప‌ర్వ‌తాలు. ఈ న‌లుగురు ఇప్పుడు జ‌న‌గామ మున్సిపాలిటిలో కింగ్ మేక‌ర్లుగా మారారు. ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి, ఇటు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డిలు జ‌న‌గామ మున్సిపాలిటిలో త‌మ జెండాను పాతాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ న‌లుగురిని ఎవ్వ‌రు ప్ర‌సన్నం చేసుకుంటే ఆ పార్టే జెండా పాత‌డం ఖాయం. ఈ న‌లుగురు ఇండిపెండెంట్లు రెండు పార్టీల నేత‌ల‌కు ప‌గ‌టి చుక్క‌లు చూపుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. పాండు ఎవ్వ‌రికి జై అంటే వారే చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకుంటారు.

Advertisement

Also Read: Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

చైర్మ‌న్ ఇస్తేనే మ‌ద్ద‌తు

మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం మార‌బోయిన పాండు విలేక‌రుల‌తో మాట్లాడారు. బీ ఆర్ ఎస్‌లో క్రీయాశీల‌కంగా ప‌నిచేసిన నాయ‌కుడిని. ఎన్నికల ముందు టికెట్ కోసం ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని ప్రాదేయ‌ప‌డ్డాము. టికెట్ ఇవ్వండి గెలుస్తామని చెప్పాము. మా మాట విన‌లేదు స‌రిక‌దా టికెట్ల కెటాయింపు ముందు క‌నీసం మ‌మ్మ‌ల్ని క‌లిసేందుకు కూడా ఆయ‌న ముఖ్య అనుచ‌రులు ద‌గ్గ‌రికి రానివ్వ‌లేదు. ఇప్పుడు రెండు పార్టీల నాయ‌కులు మా మద్ద‌తు కోరుతున్నారు. మా న‌లుగురిలో ఒక‌రి చైర్మ‌న్‌, ఒక‌రికి వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు ఇస్తే మేము ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని అన్నారు. కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీల‌కు ఇదే చెప్పాము. మాకు ఎవ్వ‌రు మాట ఇవ్వ‌లేదు.. మేము కూడా ఎవ్వ‌రికి మాట ఇవ్వ‌లేదన్నారు.

గెలిచింది వీరే

Advertisement

1వ వార్డు దుర్గాప్రసాద్ (బిఆర్ఎస్), 2వ వార్డు రామగళ్ళ విజయ్ కుమార్(కాంగ్రెస్), 3వ వార్డు బూడిద జ్యోతి(సీపీఎం), 4వ వార్డు మంత్రి సుమలత (కాంగ్రెస్), 5వ వార్డు మీద్దెపాక భాస్కర్ (స్వతంత్ర అభ్యర్థి), 6వ వార్డు బాల భరద్వాజ్(కాంగ్రెస్), 7వ వార్డు ఖమర్ (బీ ఆర్ ఎస్), 8వ వార్డు మంజుల (స్వతంత్ర అభ్యర్థి), 9వ వార్డు గునిగంటి వెన్నెల (బీ ఆర్ ఎస్), 10వ వార్డు నీరేటి శ్రీలత (కాంగ్రెస్), 11వ వార్డు ఎనగందుల అనూష (బీ ఆర్ ఎస్), 12వ వార్డు వంగ ఉమా (కాంగ్రెస్), 13వ వార్డు పానుగంటి సువార్త (బీ ఆర్ ఎస్), 14వ వార్డు అండాలు(కాంగ్రెస్), 15వ వార్డు మరబోయిన పాండు (స్వతంత్ర అభ్యర్థి), 16వ వార్డు కడకంచి సుశీల (కాంగ్రెస్), 17వ వార్డు ఉడుగుల కిష్టయ్య (బీ ఆర్ ఎస్), 18వ వార్డు గోపగోని సుగుణాకర్(బీ ఆర్ ఎస్), 19వ వార్డు దోర్నాల అనిత (కాంగ్రెస్), 20వ వార్డు దామెర రాజు (బీ ఆర్ ఎస్), 21వ వార్డు మామిడాల రజిత (బీ ఆర్ ఎస్), 22వ వార్డు కడకంచి బాలమణి (కాంగ్రెస్), 23వ అభ్యర్థి భూష పర్వతాలు (స్వతంత్ర అభ్యర్థి), 24వ వార్డు గంగారబోయిన అనిత(బీ ఆర్ ఎస్), 25వ వార్డు పాముకుంట్ల ప్రసాద్ (కాంగ్రెస్), 26వ వార్డు శ్రీవల్లి మధు (బీ ఆర్ ఎస్), 27వ వార్డు చెoచారపు కరుణాకర్ రెడ్డి (కాంగ్రెస్), 28వ వార్డు ఆఫీజ్ ఫాతిమా(బీ ఆర్ ఎస్), 29వ వార్డు మౌనిక (బీ ఆర్ ఎస్), 30వ వార్డు ఆరుట్ల లోక్‌మంతారెడ్డి (కాంగ్రెస్)లు గెలుపొందారు.

Also Read: Medchal Municipal Results: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెల్లడి!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×