E-Paper
Advertisement

KA Paul | మందకృష్ణ మోదీకి అమ్ముడు పోయారు : కేఎ పాల్

KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాశాంతి పార్టీలో చేరమని ఆహ్వానిస్తే.. మందకృష్టన రూ.25కోట్లు అడిగారని పాల్ అన్నారు. అదే పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి బీజేపీ వద్ద రూ.72కోట్లు తీసుకున్నారని పాల్ ఆరోపించారు.

KA Paul | మందకృష్ణ మోదీకి అమ్ముడు పోయారు : కేఎ పాల్
Advertisement

KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాశాంతి పార్టీలో చేరమని ఆహ్వానిస్తే.. మందకృష్టన రూ.25కోట్లు అడిగారని పాల్ అన్నారు. అదే పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి బీజేపీ వద్ద రూ.72కోట్లు తీసుకున్నారని పాల్ ఆరోపించారు. ఒకప్పుడు మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన మందకృష్ట ఇప్పుడు దేవుడని పొగుడుతున్నారని, ఆయన మోదీకి అమ్ముడుపోయారని పాల్ చెప్పారు. మోదీ బీసీ కులానికి చెందినవారు కాదని.. ఆయన తన శిష్యుడని పాల్ వ్యాఖ్యానించారు.

ప్రజాశాంతి పార్టీకి ఇంతవరకూ ఎన్నికల గుర్తు కేటాయించలేదని.. త్వరలోనే ఈ విషయంలో హై కోర్టుకు వెళ్తామని కేఎ పాల్ అన్నారు. మూడు పార్టీలకు నవంబర్ 30న ఓటు వేయొద్దని, ఇంట్లోనే కూర్చోవాలని ప్రజలకు కేఎ పాల్ సూచన చేశారు.

Advertisement

చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యకత్పుర్ తో పాటు 13 సెగ్మెట్లలో తన అభ్యర్థులు ఉన్నారని పాల్ చెప్పారు. అయినా తమ పార్టీకి ఎన్నికల గుర్తు ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన వాపోయారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని, దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన వద్దని, ప్రజలంతా కుటుంబ పాలనను తరిమేయాలని కోరారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×