E-Paper
Advertisement

KA Paul : ఎన్నికల కమిషన్‌పై మండిపడిన కేఏ పాల్

KA Paul : ఎన్నికల కమీషన్‌ ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల గుర్తునే కేటాయించకుండా వేధిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కేపే పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన ఎన్నికల సంఘం అధికారులను కలిసి పార్టీకి గుర్తు ఇంతవరకు ఎందుకు కేటాయించలేదని అడిగారు.

KA Paul : ఎన్నికల కమిషన్‌పై మండిపడిన కేఏ పాల్
Advertisement

KA Paul : ఎన్నికల కమిషన్‌ ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల గుర్తునే కేటాయించకుండా వేధిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కేపే పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన ఎన్నికల సంఘం అధికారులను కలిసి పార్టీకి గుర్తు ఇంతవరకు ఎందుకు కేటాయించలేదని అడిగారు. ఆ తరువాత మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్‌లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా ఇంత వరకు గుర్తు కేటాయించలేదు. మా పార్టీ యాక్టివ్‌గా ఉన్న యాక్టివ్‌గా లేదని చెబుతున్నార. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదు. చివరికి పోటీ చేయని వైస్సార్ తెలంగాణ పార్టీకి కూడా గుర్తు కేటాయించారు. కానీ ప్రజాశాంతి పార్టీకి కేటాయించలేదు,” అని ఎద్దేవా చేశారు.

“నామినేషన్లకు రేపే చివరి రోజు. మా అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో అధికారులు ‘మీ సింబల్ హెలికాప్టర్ గుర్తా? లేక రింగు గుర్తా?’ అని అడుగుతున్నారు. అసలు మాకు కేటాయించిన గుర్తులేంటో అధికారులు చెప్పడం లేదు. హెలికాప్టర్ సింబలా? లేక రింగా? ఎదో చెప్పాలి. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయి తమ పార్టీకి సింబల్ రాకుండా చేస్తున్నారా?. అయినా అందరికీ అడిగిన సింబల్స్ ఇచ్చి మా ఒక్కరికే సింబల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి. ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప కేటాయించడం లేదు. చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి.. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను. ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలి. లేదా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం,” అని కేఏ పాల్ చెప్పారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×