E-Paper
Advertisement

Yashaswini Reddy : ఎర్రబెల్లికి డేంజర్ బెల్స్ .. యశస్విని రెడ్డి స్పీచ్ అదుర్స్..

Yashaswini Reddy :  ఎర్రబెల్లికి డేంజర్ బెల్స్ .. యశస్విని రెడ్డి స్పీచ్ అదుర్స్..
Advertisement

Yashaswini Reddy : పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు భారీగా జనం పోటెత్తారు. సభ జరుగుతున్నంతసేపు సందడి వాతావరణం కనిపించింది. మహిళలు, యువత ఈ సభలో ఎక్కువగా కనిపించారు. ఈ సభలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి స్పీచ్ హైలెట్ గా నిలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హయాంలో పాలకుర్తిలో ఏం అభివృద్ధి జరిగిందని ఆమె ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ మంత్రి గా ఉన్న ఎర్రబెల్లి పాలకుర్తికి చేసింది ఏమి లేదన్నారు. 15 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నారని విమర్శించారు. అలాంటి దయాకర్ రావుకు మరోసారి అవకాశం ఇస్తారా అని ప్రజలను యశస్విని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపైనా కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబంలో చేతిలో బంధిగా మారిందన్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని యశస్విని రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. పాలకుర్తిలో తన గెలుపు ఖాయమన్నారు. ఎవరికీ భయపడవద్దని నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పారు. తాను ప్రజల వెంటే నిలబడతానని భరోసా ఇచ్చారు.తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతాన్ని ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తానని యశస్విని రెడ్డి ప్రకటించారు. బైబై కేసీఆర్, బైబై ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న పిన్నవయస్కురాలు యశస్విని. ఎక్కడ తడబాటులో లేకుండా ఎంతో పరిణతితో సూటిగా సరళంగా ఆమె మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. తాను గెలిస్తే ప్రజలకు ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ఇలా ఆమె ప్రసంగం ఎంతో ఆసక్తిగా సాగింది. అందువల్లే సభకు వచ్చిన జనం యశస్విని రెడ్డి ప్రసంగిస్తున్నసేపు హర్షధ్వానాలు పలుకుతూనే ఉన్నారు. ఆమె మాట్లాడిన ప్రతి మాటకు జనం నుంచి విశేష స్పందన వచ్చింది.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×