Kannaiah Goud suicide | తెలంగాణ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ మరణించారు. నిజామాబాద్ పట్టణం సాయినగర్ ప్రాంతంలో నివాసముంటున్న కన్నయ్య గౌడ్ ఆదివారం ఉదయం ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ మరణించారు. నిజామాబాద్ పట్టణం సాయినగర్ ప్రాంతంలో నివాసముంటున్న కన్నయ్య గౌడ్ ఆదివారం ఉదయం ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన కుటుంబసభ్యులు ఆయనను ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు ధృవీకరించారు.
కన్నయ్యగౌడ్ చనోపోయేముందు కొందరు దుండగలు ఆయనను బ్లాక్ మెయిల్ చేసి వేధించేవారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆయన సెల్‌ఫోన్ పరిశీలించగా.. ఆయనకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు బయటపడ్డాయి. ఆ వీడియోలను ఆ దుండగులు పంపి కన్నయ్యకు బ్లాక్ మెయిల్ చేసేవారని తెలుస్తోంది. ఆ దుండగులకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. మరోవైపు ఈ వీడియోలు బయటికొస్తే ఎన్నికలలో పోటీ చేసే తన పరువు పోతుందని భావించిన కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.
.
.
.