E-Paper
Advertisement

Kavitha On SPB: ఎస్పీబీ తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారట.. విగ్రహం వివాదంపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha On SPB: ఎస్పీబీ తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారట.. విగ్రహం వివాదంపై కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

Kavitha On SPB: ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారు అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలీదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ వాదులు రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ గీతమైన “జయ జయహే తెలంగాణ”ను పాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారన్నారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడాన్ని తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నారన్నారు.

రవీంద్ర భారతి తెలంగాణ కళాకారులకే

ఈ విషయంలో తెలంగాణ వాదులకు తన సపోర్టు ఉంటుందని కవిత ప్రకటించారు. ఎస్పీ బాలు విగ్రహం పెట్టుకోడానికి ఇంకెక్కడైనా ప్లేస్ చూడడం మంచిదని కవిత సూచించారు. రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని కవిత సూచించారు. ఈనెల 15న ఎస్పీ బాలు విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: Vikarabad News: వికారాబాద్‌ జిల్లాలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

ఎస్పీ బాలు విగ్రహానికి మరేదైనా ప్లేస్

“బాల సుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఇంకేమైనా మంచి ప్లేస్ చూసుకోండి. తెలంగాణ కళాకారుల విగ్రహాలను రవీంద్రభారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకు ముందు తెలంగాణ కళాకారులకు చోటులేదనే ఆవేదన ఉంది. తెలంగాణ వచ్చాక అన్ని జానపదకళలను అక్కడ ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నం చేశాము. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశాము. అటువంటి చోటులో సినిమా కళాకారుడైన ఎస్పీ బాలు విగ్రహం పెట్టడం సరికాదని నా అభిప్రాయం. సినిమా కళాకారుల విగ్రహాల కోసం ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి. విగ్రహాలు పెట్టొద్దని నేను అనడంలేదు కానీ రవీంద్ర భారతిలో మాత్రం తెలంగాణ జానపద కళాఖారులకు చోటు ఉండాలనేది నా అభిమతం” – కల్వకుంట్ల కవిత

Related News

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Big Stories

Advertisement
×